రక్తమోడిన రహదారులు.. ఐదుగురు దుర్మరణం

రెండు చోట్ల వేర్వేలు ప్రమాదలు జరిగియి. ఈ దుర్ఘటనలో ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు మృతి చెందగా.. సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు కూలీలు దుర్మరణం పాలయ్యారు.

తెలంగాణలో రహదారులు రక్తసిక్తం అయ్యాయి. రాష్ట్రంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం మన్నూరు సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మినీ లారీ, ట్రాక్టర్‌ ఢీకొనడంతో ఘటన జరిగింది. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అనంతపురం జిల్లా ధర్మవరం నుండి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న టమాటా లోడ్ తో వెళ్తున్న ఐచర్ వాహనం అత్యంత వేగంగా ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఇద్దరు ఐచర్ వాహనదారుల కాగా…. ఒకరు ట్రాక్టర్ వాహనదారుడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ వాహనదారుడు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ రూరల్ మండలము ఆంకొలి గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మరో అంకొలి వాసిని పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని నిర్ధారణకు వచ్చారు.

మరో రోడ్డు ప్రమాదం సిరిసిల్ల జిల్లాలో జరిగింది. రుద్రంగిలో జరిగిన మరో ప్రమాదంలో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. నడిచి వెళ్తున్న కూలీలను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. మృతులను మహారాష్ట్రకు చెందిన సందీప్‌(18), వెంకట్‌ పవార్‌(15)గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీఆర్ఎస్‌లోకి కౌశిక్ రెడ్డి .. ముహుర్తం ఖరారు ?

Sat Jul 17 , 2021
కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన త్వరలోనే టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయ్యింది. మరో నాలుగు రోజుల్లో ఆయన అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.