ఏప్రిల్ 30లోపు కచ్చితంగా పూర్తి చేయాల్సిన 5 పనులివే.. లేదంటే..

ఏప్రిల్ 30లోపు కొన్ని పనులు పూర్తి చేయాల్సి ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీఎఫ్, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ దగ్గరి నుంచి ట్యాక్స్ వరకు పలు పనులు పూర్తి చేయాలి. లేకపోతే నష్టపోవాల్సి రావొచ్చు.

ప్రధానాంశాలు:ఈ నెలలోపు చేయాల్సిన పనులువెంటనే చేసేయండిలేదంటే నష్టపోవాల్సి రావొచ్చుకోవిడ్ 19 కేసుల భారీగా పెరుగుతున్నాయి. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మనం మళ్లీ ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అదేసమయంలో ఈ నెల చివరికల్లా మనం కొన్ని పనులు కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది ఈ విషయాలు మర్చిపోయే అవకాశముంది. అందుకే ఏ ఏ పనులు పూర్తి చేయాల్సి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. వడ్డీ ఆదాయం, డివిడెండ్స్‌పై టీడీఎస్ TDS భారం తప్పించుకోవాలని భావించే వారు ఈనెల చివరిలోపు ఫామ్ 15జీ (60 ఏళ్లకు లోపు వయసు కలిగిన వారు), ఫామ్ 15 హెచ్ (సీనియర్ సిటిజన్స్) సమర్పించాలి.

2. పన్ను ఆదా చేసుకోవాలని భావిస్తే.. ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. దీని కోసం మీరు ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌లో ELSS డబ్బులు పెట్టొచ్చు. మంచి స్కీమ్ ఎంచుకొని సిప్ రూపంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది.

Also Read: గ్యాస్ సిలిండర్ వాడే వారికి అదిరిపోయే శుభవార్త.. ఇక ఏ ఏజెన్సీ నుంచైనా సిలిండర్ పొందొచ్చు?

3. ప్రావిడెంట్ ఫండ్ PF కంట్రిబ్యూషన్‌పై ఇన్‌కమ్ ట్యాక్స్ Tax రూల్స్ మారాయి. ఏడాదిలో పీఎఫ్ కంట్రిబ్యూషన్‌పై రూ.2.5 లక్షలకు పైన పొందిన వడ్డీ మొత్తంపై పన్ను పడుతుంది. మీరు ఈపీఎఫ్, వీపీఎస్ స్కీమ్స్‌లో రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ డబ్బులు పెడుతూ ఉంటే.. మీ కంపెనీ హెచ్ఆర్‌కు తెలియజేసి పన్ను భారం లేకుండా సర్దుబాటు చేసుకోండి.

Also Read: నేటి బంగారం, వెండి ధరలు ఇలా!

4. మీ పీఎఫ్ కట్రిబ్యూషన్ ఏడాదిలో రూ.2.5 లక్షలు దాటితే.. మీరు ఒక పని చేస్తే బాగుంటుంది. అది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ PPF ఖాతా తెరవడం. పీపీఎఫ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. 20 శాతం లేదా ఆపైన ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్న వారికి ట్యాక్సబుల్ ప్రావిడెంట్ ఫండ్ కన్నా పీపీఎఫ్ ద్వారా ఎక్కువ రాబడి లభిస్తుంది.

5. స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్ల వచ్చే త్రైమాసికం నుంచి తగ్గే అవకాశముంది. అయినా కూడా పోస్టాఫీస్ స్కీమ్స్‌లో చేరడం వల్ల పన్ను మినహాయింపు ప్రయోజనాలతోపాటు ఆకర్షణీయ రాబడి పొందొచ్చు. అయితే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర, ఎన్ఎస్‌సీ వంటి స్కీమ్స్‌లో చేరితే ప్రస్తుత వడ్డీ రేట్లను లాక్ చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

సమావేశంలో మాస్క్ ధరించని ప్రధాని.. రూ.14వేలు ఫైన్ వేసిన అధికారులు!

Tue Apr 27 , 2021
Thailand Covid Restrictions చట్టానికి ఎవరూ అతీతులు కాదు.. చట్టాలను చేసిన పాలకులైనా వాటిని ఉల్లంఘిస్తే శిక్షార్హులే. థాయ్‌లాాండ్ అధికారులు కూడా ఇదే పాటించారు.