సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత.. ప్రధాని మోదీ సంతాపం

ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం మరణించారు.

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు కరోనా కారణంగా కొందరు సినీ ప్రముఖులు మరణిస్తుంటే.. మరోవైపు అనారోగ్య సమస్యలతో ఇంకొంతమంది సెలెబ్రిటీలు కన్నుమూస్తుండటం యావత్ సినీ లోకాన్ని కలవరపెడుతోంది. తాజాగా ప్రముఖ బెంగాలీ చిత్ర నిర్మాత, రచయిత బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

ఆయన మరణవార్త తెలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. ఈ విషయం చాలా బాధ పెట్టిందంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా వైవిధ్యభరిత రచనలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజల జీవితాలకు అద్ధం పడతాయని, ఆయన గొప్ప తత్వవేత్త, కవి అని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేస్తూ బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా మరణం విచారకరం అని, ఆయన తన రచనల ద్వారా తన సాహిత్యాన్ని సినీలోకానికి పరిచయం చేశారని, ఆయన మరణం సినీలోకానికి తీరని లోటని అన్నారు.

దాదాసాహెబ్ ఫాల్కే, సత్యజిత్ రే వాస్తవిక చిత్రాల నుంచి ప్రేరణ పొందిన బుద్ధదేవ్‌కు ''బాగ్‌ బహదూర్‌, తహదర్‌ కథ, చరాచార్‌, ఉత్తర'' లాంటి సినిమాలు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. చిత్ర సీమకు అందించిన సేవలకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు బుద్ధదేవ్‌ దాస్‌గుప్తా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

మా తాత సీఎం, మా నాన్న సీఎం.. అయినా.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Thu Jun 10 , 2021
సీఎం వైఎస్ జగన్‌ను అమూల్ బేబీ అనడంపై తీవ్రంగా స్పందించారు మంత్రి అనిల్. చినబాబుకి ఫ్రస్ట్రేషన్ బాగా ఎక్కువైంది. గూగుల్‌లో టైప్ చేస్తే పప్పు అని వస్తోంది. గడ్డం పెంచినంత మాత్రాన ఒరిగేదేమీ లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.