జైల్లో ఖైదీలతోనే మహిళా ఆఫీసర్ శృంగారం.. ఓసారి 11 మంది చూస్తుండగానే ఖైదీతో సెక్స్!

ఖైదీల ప్రవర్తనలో మార్పులు తీసుకొచ్చి, వారు తప్పుచేస్తే మార్గదర్శనం చేయాల్సిన మహిళా అధికారిణి పెడదారి పట్టింది. ఏకంగా ఖైదీలతోనే లైంగిక చర్యల్లో మునిగితేలింది.

ప్రధానాంశాలు:జైల్లోనే అధికారిణి లైంగిక సంబంధాలు.ఖైదీలకు డ్రగ్స్, మొబైల్ ఫోన్‌లు సరఫరా.గతేడాది మేలో వెలుగులోకి వచ్చిన ఘటన.జైలు నిబంధనలు గాలికి వదిలి ఖైదీలతో ఓ అధికారిణి విచ్చలవిడిగా కామకేళీలు సాగించిన ఘటన అమెరికాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో కాలిఫోర్నియా ప్రెస్నో కౌంటీ సవరణ అధికారిణి టీనా గొంజాలెజ్‌ (26)కు న్యాయస్థానం రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష విధించింది. ప్రెస్నో కౌంటీ జైల్లో 2016 నుంచి టీనా గొంజాలెజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జైల్లోని ఖైదీలను దారిపెట్టాల్సిన ఆమే దారితప్పింది. తనకు ఇష్టమొచ్చిన సమయంలో ఖైదీలతో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలేది.

ఓ సారి 11 మంది ఖైదీలు ఎదురుగానే ఓ నేరస్థుడితో శృంగారంలో పాల్గొంది. అంతటితో ఆగకుండా ఖైదీలకు సెల్‌ఫోన్లు, రేజర్లు సరఫరా చేస్తూ, సోదాలు జరిగేటపుడు వారికి ముందుగానే సమాచారం ఇచ్చి అప్రమత్తం చేసేదని జైలు అధికారి షరీఫ్ స్టీవ్ మెక్‌కొమాస్ కోర్టుకు తెలిపారు. ఖైదీలతో అసభ్యకరంగా మాట్లాడుతూ, తాను చేసిన నేరాల గురించి వారితో గొప్పగా చెప్పుకొనేదని వివరించారు. ఎటువంటి పశ్చాత్తాపం కూడా ఆమెలో కనిపించేది కాదని వివరించారు.

ఆమె ప్రవర్తన గురించి అధికారి వివరిస్తూ న్యాయమూర్తి విస్తుపోయారు.‘‘దారుణంగా ప్రవర్తించావు. నీ కెరీర్‌ను సర్వనాశనం చేసుకున్నావు’’ అని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే, గొంజాలెజ్‌కు గత నేరచరిత్ర లేకపోవడంతో శిక్షను తగ్గించారు. రెండేళ్ల ప్రొబేషన్, ఏడు నెలల జైలు శిక్ష ఖరారు చేశారు. ‘చేసిన తప్పులను సరిదిద్దుకుని బయటపడతారని నేను నమ్ముతున్నాను.. అలా చేయడానికి మీకు ఇంకా అవకాశం ఉంది.. గుడ్ లక్’ అంటూ న్యాయమూర్తి తీర్పును ముగించారు.

గొంజాలెజ్ వ్యవహారం గతేడాది మే నెలలో వెలుగులోకి వచ్చింది. కరెక్షన్ ఆఫీసర్‌గా తాను చేసిన నేరాలపై‘ప్రగల్భాలు పలుకుతున్నారు’ అని మెక్కోమాస్ తెలిపారు. ఖైదీలతో తన లైంగిక కార్యకలాపాలు, డ్రగ్స్, ఆల్కహాల్, మొబైల్ ఫోన్ అందజేసిన విషయాన్ని అంగీకరించారు. గొంజాలెజ్‌ తన భర్త నుంచి విడిపోయిన సమయంలోనే ఈ నేరాలకు పాల్పడ్డారని ఆమె తరఫున లాయర్ వాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

చంకల్లో దుర్వాసనా? ఈ చిట్కాలతో కంపు దూరం!

Mon Jul 5 , 2021
చంకల్లో దుర్వాసనతో బాధపడుతున్నారా? అయితే, ఈ చిట్కాలను పాటిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుంది.