సీఎం కేసీఆర్ ‘కంచం’పై ట్రోలింగ్.. వాళ్లు తినే ప్లేట్ పనికి రాదా?

ఎస్సీ నేతలతో సీఎం కేసీఆర్ విందు భోజనంపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అందరం ఒకటి అంటూనే దొర తేడా బాగా చూపించారంటూ విమర్శలు వస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ ట్వీట్‌కి నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు.

ఉద్యోగం వదులుకుని మరీ రాజకీయాల్లోకి వచ్చిన మాజీ ఐపీఎస్, బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అవకాశం చిక్కితే కేసీఆర్ సర్కార్‌పై పదునైన విమర్శలతో విరుచుకుపడుతుంటారు. దళిత బంధుతో ప్రతిపక్షాలు డైలమాలో పడినప్పటికీ బహుజన వాదంతో ముందుకొచ్చిన ప్రవీణ్ దళిత బంధు ఖర్చు చేయాల్సిన పద్ధతి ఇది కాదంటూ ఇరుకునపెట్టే ప్రయత్నం చేశారు. తాజాగా మరోమారు కేసీఆర్ సర్కార్‌ విధానాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ఐపీఎస్.

ఎస్సీ నేతలకు కేసీఆర్ విందుపై ఆర్‌ఎస్ ప్రవీణ్ ఘాటుగా స్పందించారు. ఒకవైపు నేతలతో సీఎం విందు. మరో వైపు హైకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు నిలిపివేశారని ఆయన ధ్వజమెత్తారు. సచివాలయం కారిడార్లలో చాలా కుట్రలు, డ్రామాలు జరుగుతున్నాయని ఘాటు విమర్శలు చేశారు. అవన్నీ కేసీఆర్‌కి తెలియకుండానే జరుగుతాయా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇకనైనా కళ్లు తెరిచి కారు దిగి ఏనుగును ఎక్కి పాలకులు కండి అంటూ ట్వీట్ చేశారు.

దానితో పాటే ఎస్సీ నేతలతో కేసీఆర్ విందు ఫొటోను కూడా జత చేయడం ఆసక్తికరంగా మారింది. నెట్టిజన్ల దృష్టి కేసీఆర్ కంచంపై పడింది. ఎస్సీ నేతలతో విందు అని చెబుతూ కేసీఆర్ ప్రత్యేకమైన కంచంలో తినడమేంటని ప్రశ్నిస్తున్నారు. అందరి మాదిరిగా ఫైబర్ ప్లేట్‌లో తినలేరా అంటూ కామెంట్లు పెడుతున్నారు. దళితులకు ఫైబర్ ప్లేటు.. దొరకు స్టీల్ ప్లేటు, రాగి గ్లాసు అంటూ సెటైర్లు వేస్తున్నారు. కేసీఆర్ ఐడియాలజీ తాలిబన్ల కంటే ప్రమాదకరం, కాలకూట విషపు విందు అంటూ దారుణమైన కామెంట్లు చేయడం గమనార్హం.

Also Read: రేవంత్‌పై చంద్రబాబుకి ఫిర్యాదు చేశా.. మంత్రి మల్లా రెడ్డి షాకింగ్ కామెంట్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అగాథంలోకి జారుతున్న చంద్రబాబు.. ఇక, వెనక్కి రాలేనంతగా.. ఎంపీ సంచలనం!

Sat Aug 28 , 2021
TDP: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.