ఆ ఆడియోను నమ్మొద్దు, నాకు సంబంధం లేదు.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ

తాను మాట్లాడినట్లు వైరల్‌ అవుతున్న ఆడియో టేపులు నకిలీవన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.. దీనిపై గతంలో సీబీఐ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్‌ అవుతున్న నకిలీ వార్తలను నమ్మొద్దన్నారు.

ప్రధానాంశాలు:లక్ష్మీనారాయణ పేరుతో ఆడియో వైరల్ట్వీట్ చేసి క్లారిటీ ఇచ్చిన సీబీఐ మాజీ జేడీఇప్పటికే ఫిర్యాదు చేశానన్న లక్ష్మీనారాయణసోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న ఆడియోపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారు. కొంతమంది తన పేరుతో నకిలీ ఆడియోను రూపొందించారని.. దాన్ని నమ్మొద్దని కోరారు. WHOలో పనిచేస్తున్న తన స్నేహితుడు ఇచ్చిన సమాచారాన్ని చెబుతున్నాంటూ తన పేరుతో కొందరు నకిలీ ఆడియో సృష్టించి సోషల్‌ మీడియాలో పోస్టు చేసినట్లు తెలిసిందన్నారు.

ఆడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కొవిడ్‌ పరిస్థితులపై తాను మాట్లాడినట్లు వైరల్‌ అవుతున్న ఆడియో టేపులు నకిలీవన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.. దీనిపై గతంలో సీబీఐ విభాగంలో ఫిర్యాదు చేశానన్నారు. తన పేరుతో వైరల్‌ అవుతున్న నకిలీ వార్తలను నమ్మొద్దని.. అలాగే షేర్‌ చేయొద్దని ఆయన కోరారు. అలాగే నెటిజన్లు కూడా లక్ష్మీనారాయణ ట్వీట్‌పై స్పందిస్తున్నారు. తాము కూడా ఈ విషయం తెలియక షేర్ చేశామని.. ఇకపై జాగ్రత్తగా ఉంటామని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కరోనా కట్టడికి మినీ లాక్‌డౌన్‌లపై కేంద్రం సంచలన ప్రకటన.. ఇకపై కఠిన ఆంక్షలు

Mon Apr 26 , 2021
దేశంలో కరోనా మహమ్మారి దావానంలా వ్యాపిస్తోంది. అన్ని రాష్ట్రాలను చాపలా చుట్టేస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది.