భారత మహిళా క్రికెటర్ స్టన్నింగ్ క్యాచ్.. బౌండరీ లైన్ వద్ద డియోల్ సాహసం

బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టి.. లైన్‌ని తాకే సమయంలో బంతిని మైదానంలోకి విసిరి.. ఆ తర్వాత బౌండరీ లైన్ వెలుపల నుంచి మళ్లీ డైవ్ చేసి బంతిని క్యాచ్‌గా అందుకోవడం పురుషుల క్రికెట్‌లో సాధారణంగా చూస్తుంటాం. కానీ.. మహిళల క్రికెట్‌లో.. అదీ భారత ఫీల్డర్ ఆ సాహసం చేసింది.

ప్రధానాంశాలు:ఇంగ్లాండ్‌తో ఫస్ట్ టీ20లో ఓడిన భారత్ మహిళల జట్టుబౌండరీ లైన్ వద్ద అద్భుత క్యాచ్ పట్టిన డియోల్ మహిళల క్రికెట్‌లో అత్యుత్తమ క్యాచ్‌గా కితాబులు రెండో టీ20 మ్యాచ్ ఆదివారంభారత మహిళల క్రికెట్ జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలు ఊహించని విధంగా మెరుగయ్యాయి. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల వన్డే సిరీస్‌లో ఓపెనర్ స్మృతి మంధనా బౌండరీ లైన్‌ వద్ద ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి క్యాచ్ అందుకోగా.. తాజాగా టీ20 సిరీస్‌లో మరో ప్లేయర్ హర్లీన్ డియోల్ బౌండరీ లైన్ వద్ద అద్భుతరీతిలో క్యాచ్ అందుకుంది. మహిళా క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ క్యాచ్‌గా మాజీ క్రికెటర్లు అభివర్ణిస్తున్నారు.

ఇంగ్లాండ్‌లోని కంట్రీ గ్రౌండ్ వేదికగా తాజాగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అమీ జోన్స్ (43: 27 బంతుల్లో 4×4, 2×6) దూకుడుగా ఆడుతూ కనిపించింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన శిఖా పాండే బౌలింగ్‌లో లాంగాఫ్ దిశగా సిక్స్ కోసం జోన్స్ హిట్ చేసింది. అయితే.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న డియోల్ సిక్స్‌గా వెళ్తున్న బంతిని గాల్లోకి ఎగిరి రివర్స్ కప్‌లో క్యాచ్‌గా అందుకుంది. అయితే.. ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పిపోయిన డియోల్ బౌండరీ లైన్‌పైకి వెళ్లబోతూ.. రెప్పపాటులో బంతిని మైదానంలోకి ఎగరేసింది. ఆ తర్వాత బౌండరీ లైన్ లోపల అడుగుపెట్టి.. మళ్లీ మైదానంలోకి డైవ్ చేసి బంతిని క్యాచ్‌గా అందుకుంది.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో భారత్ జట్టు 8.4 ఓవర్లు ముగిసే సమయానికి 54/3తో నిలిచిన దశలో వర్షం పడింది. దాంతో.. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లాండ్ టీమ్ 18 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో టీ20 ఆదివారం జరగనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

హ్యాండిచ్చిన ప్రియుడు.. పగతో రగిలిపోయిన ప్రియురాలు ఏం చేసిందంటే..

Sat Jul 10 , 2021
ప్రేమించినవాడు తనను పక్కనబెట్టి మరో అమ్మాయికి దగ్గరకావడం తట్టుకోలేకపోయింది. తానే సర్వస్వమన్న ప్రియుడు మోసం చేయడంతో అతడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భావించింది.