సోంపు తింటే పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయా..

మహిళలు ఒక వయసుకు వచ్చిన తర్వాత వారిలో పీరియడ్స్ రావడం సహజమే. వారి గర్భసంచికి ఇరువైపులా రెండు చేతుల తరహాలో ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. వీటి పక్కన అండాశయాలు ఉంటాయి. ఈ ఓవరీస్ లోపల ప్రతి నెల అండాలు ఉత్పన్నం అవుతాయి. అండాలు మన కంటికి కనిపించవు.

ప్రధానాంశాలు:కొన్ని కారణాల వల్ల పీరియడ్స్ ప్రాబ్లమ్స్ఇంటి చిట్కాల ద్వారా సమస్యకి పరిష్కారంమాములుగా అండాలు అనేవి ఫాలికల్ రూపంలో నీటి బుడగ లోపల ఉంటాయి. పీరియడ్ వచ్చినప్పుడు ఆ ఫాలికల్ మెల్లగా పెద్దది అవుతుంది. పీరియడ్ వచ్చిన 10 నుంచి 18 రోజుల మధ్యలో పెద్దగా మారి పగిలిపోతుంది. ఈ దశలో అండం అనేది ఓవరీస్ నుంచి బయటపడిపోతుంది. ఈ అండాన్ని ఫెలోపియన్ ట్యూబ్ తనలోకి లాగుతుంది. ఆ సమయంలో భార్యాభర్తలు కలవడం వల్ల గర్భసంచిలో పిండం ఏర్పడుతుంది. ఒకవేళ పురుష బీజం కలవకపోతే గర్భాశయపు లోపలి గోడ (ఎండోమెట్రియం) విచ్ఛిన్నమై రక్తంతో పాటు యోని మార్గం ద్వారా బయటకు వస్తుంది. దీనినే నెలసరి అంటారు.
గుండెనొప్పులు ఎక్కువ మహిళలకు వస్తాయా.. పురుషులకా..
సాధారణంగా మహిళకు 21 నుంచి 35 రోజులలోపు నెలసరి రావాలి. ఒకవేళ 21 రోజుల కంటే తక్కువ, 35 రోజుల కంటే ఎక్కువ రోజుల్లో నెలసరి వస్తే వాళ్లు వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో చాలామంది మహిళలు పీరియడ్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు వైద్యులను సంప్రదిస్తే గర్భసంచిని పరిశీలించి ఏవైనా కణితులు ఉంటే తొలగిస్తారు. ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఎక్కువ అండాలు నిల్వ ఉన్నా, తక్కువ ఉన్నా నెలసరి సమస్యలు తలెత్తుతుంటాయి. స్కానింగ్ ప్రక్రియ ద్వారా అండాశయంలోని సమస్యలను వైద్యులు గుర్తిస్తారు.

నెలసరి సమయంలో వచ్చే సమస్యలు:

నెలసరి సమయంలో కనిపించే లక్షణాలు, సమస్యలు మహిళల్లో వేరువేరుగా ఉండవచ్చు

✤ కడుపునొప్పి, కడుపుబ్బరము, మంట, తలనొప్పి, అలసట, నడుమునొప్పి సాధారణంగా కనిపిస్తుంటాయి. బహిష్టు అయ్యే సమయానికి ముందు కనిపించే ఈ లక్షణాలను ప్రీ మెన్స్ట్రుయల్ సిండ్రోమ్ అంటారు.
✤ కొందరికి పొత్తికడుపులో నొప్పి, బిగుసుకు పోవటం కలుగుతుంది. దీనిని డిస్మెనోరియా అంటారు.
✤ కొందరికి నెలసరి సమయంలో అధికంగా రక్త స్రావం జరుగుతుంది.
✤ నెలసరి సమయంలో రక్తస్రావం లేకపోతే అమెనోరియా అంటారు. గర్భం ధరించని దశలో, శిశువుకు పాలిస్తున్న సమయంలో ఇది సాధారణం. ఇతర సందర్భాల్లో రుతు స్రావం ఏర్పడకపోతే వైద్యున్ని సంప్రదించాలి.
పెళ్ళైంది.. కానీ, ఎక్సర్‌సైజ్ చేయిస్తున్న వ్యక్తితో అలా..
మహిళలు నెలసరి సమస్యలను పరిష్కరించుకోవడానికి కరివేపాకును వాడాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ తరం అమ్మాయిల్లో నెలసరి సరిగ్గా రాకపోవడం, ఆకలి వేయకపోవడం వంటి సమస్యలను దూరం చేసుకోవాలంటే.. కరివేపాకు పొడిని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే సరిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఆకలిలేమి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఆహారంలో కరివేపాకు తప్పకుండా వాడాలి.

కరివేపాకులో మహిళలకు కీలకంగా ఉపయోగపడే ల్యూటిన్‌, ఫోలిక్‌యాసిడ్‌, ఇనుము, కాల్షియం, నియాసిన్‌, బీటాకెరటిన్‌ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రుతుక్రమ సమస్యలతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే వేసవిలో కరివేపాకుని చల్లటి మజ్జిగలో వేసి, కాస్త వామూ, ఉప్పూ కలిపి తాగండి. జీర్ణశక్తి పనితీరు మెరుగుపెడుతుంది. ఇంకా చెప్పాలంటే కరివేపాకును పచ్చడి లేదా పొడి రూపంలో తీసుంటే నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. నిద్రలేమిని తొలగించుకుంటే బరువు తగ్గడం కూడా సులభం అవుతుంది. కరివేపాకు కాల్షియం, ఇనుము సమపాళ్లల్లో శరీరానికి అందుతాయి. ఫలితంగా నెలసరి క్రమబద్ధం అవుతుంది. రక్తంలోని చక్కెరస్థాయులూ అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నెలసరి సమస్యల పరిష్కారానికి కొన్ని చిట్కాలు:

★ అల్లం: అల్లంలో ఎన్నో గొప్ప ఔషదాలు ఉన్నాయి. వాటితో ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చు. ఓ కప్పు నీటిలో తాజా అల్లం ముక్కని వేసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత దీనిని వడకట్టండి. ఇప్పుడు ఈ మిశ్రమానికి కాసింత తేనెను కలపండి. దీనిని ప్రతీ రోజూ భోనం చేసిన తర్వాత తాగండి. దీని వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. పీరియడ్స్ రెగ్యులర్‌గా తయారవుతాయి.

★ దాల్చిన చెక్క: దీనిలో కూడా ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. హార్మోన్స్‌ని బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ మసాలా దినుసు చక్కగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి రుతు క్రమ సమస్యలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.. ఇందుకోసం దాల్చిన చెక్కని చక్కగా పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్‌ని గోరువెచ్చని పాల్లలో కలిపి తాగాలి. అదే విధంగా.. మీరు తీసుకునే ప్రతీ ఆహారంపైనా ఈ పొడిని చల్లుకుని తీసుకోవచ్చు. దీని వల్ల పీరియడ్స్ కచ్చితంగా రెగ్యులర్ అవుతాయి.

★ హార్మోన్‌ల మార్పుల వల్ల శరీరంపై కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ కారణంగానే పీరియడ్స్ తప్పడం, ఆగిపోవడం జరుగుతుంటుంది. అయితే అన్ని రకాలైన పోషకాలు, మినరల్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. అందుకోసం రకరకాల పండ్లు, కూరగాయలను మీ డైట్‌లో చేర్చుకోండి. అదే విధంగా క్యారెట్, ద్రాక్ష వంటి వాటిని జ్యూస్ చేయడం వల్ల కచ్చితంగా పీరియడ్స్ సమస్యలు దూరం అవుతాయి.
భోజనం ఎంత తిన్నా బరువు తగ్గాలంటే ఇలా చేయండి.. ★ ఆధునిక యుగంలో లైఫ్ స్టైల్ కారణంగా కూడా చాలా వరకూ మహిళలలో ఒత్తిడి ఎదురవుతోంది. ఈ కారణంగా రుతుక్రమ సమస్యలు వస్తాయి. ఇందుకోసం ప్రతీ రోజూ ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా, ధ్యానం చేయొచ్చు. ఇలా చేయడం వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. దీని వల్ల సమస్య తగ్గుతుంది.

★ సోంపు: సోంపు కూడా నెలసరి సమస్యలకు పరిష్కారం చూపుతుంది. సోంపు, సోంపు గింజల ఆకులు కూడా పీరియడ్స్ ఇరెగ్యులర్ సమస్యను కంట్రోల్ చేస్తుంది. ఈ గింజలను పీరియడ్స్ సమయంలో వాడడం వల్ల నొప్పులు కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఈ గింజలను వాడి పీరియడ్స్‌ని ఎలా రెగ్యులర్ చేసుకోవాలో చూద్దాం.. ఇందుకోసం ముందుగా రెండు టీస్పూన్ సోంపుని తీసుకుని రాత్రంతా నానెబట్టండి. ఇప్పుడు ఉదయాన్ని ఆ నీటిని వాడబోసి తాగండి. మీకు పీరియడ్స్ రెగ్యులర్‌గా అయ్యేవరకూ వీటిని తాగడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల త్వరగానే సమస్య పరిష్కారం అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Telangana Cabinet అత్యవసర భేటీ.. లాక్‌డౌన్ ఎత్తివేత? కొత్తగా వీటికి అనుమతులిచ్చే ఛాన్స్!

Fri Jun 18 , 2021
Telangana Lockdown Update: ఎప్పటిలాగే సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. లాక్‌డౌన్‌ విషయమై తదుపరి నిర్ణయాన్ని ఈ భేటీలో తీసుకొని అనంతరం ప్రకటించనున్నారు.