తెలంగాణలో స్కూళ్ల ప్రారంభం ఇక అప్పుడే.. ఈ తరగతులకు కాస్త ముందే..

Telangana News: విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కరోనా మహమ్మారి రెండో విడత విరుచుకుపడడంతో మళ్లీ మూత పడిన తెలంగాణలోని విద్యాసంస్థలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పై తరగతులకు చెందిన విద్యా సంస్థలను పున:ప్రారంభించేందుకు కాస్త ముందుగానే ప్రయత్నాుల మొదలయ్యాయి. ఈ నెల 16 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న వేళ 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు తీసుకోనున్నారు. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గుముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జులై నెలాఖరు వరకు కరోనా రెండో విడత తగ్గు ముఖం పడుతుందని.. స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖికపరమైన ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు, ప్రస్తుతం కరోనా కేసులతో ఇంటర్ వరకూ అన్ని పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేయగా.. తాజాగా రెండో సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

USలో ప్రతి ఇద్దరి భారతీయుల్లో ఒకరిపై వివక్ష..సగం మందికి కులపిచ్చి: సర్వేలో ఆసక్తికర విషయాలు!

Thu Jun 10 , 2021
Indian-Americans Discrimination గతేడాది కాలంలో ప్రతి ఇద్దరు భారతీయ అమెరికన్లలో ఒక్కరు వివక్షను ఎదుర్కొన్నట్టు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడయ్యింది.