కరోనా వ్యాప్తికి ఈసీయే కారణం.. అధికారులపై హత్య కేసు: మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు

దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల కరోనా వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ పార్టీలు కనీసం కోవిడ్ నిబంధనలు పాటించలేదు.

ప్రధానాంశాలు:ప్రచారంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన.దేశంలో భారీగా పెరుగుతున్న కోవిడ్ కేసులు.కేంద్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు ఆగ్రహం.దేశంలో కరోనా వైరస్ అడ్డఅదుపూ లేకుండా పెరిగిపోవడానికి ఎన్నికల కమిషనే కారణమని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కోవిడ్ నిబంధనల విషయంలో ఈసీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందని మండిపడింది. ఈ అంశంలో ఎన్నికల సంఘం అధికారులపై హత్యకేసు నమోదుచేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్ కుమార్‌ల ధర్మాసనం ఆదేశించింది. కోవిడ్ కొనసాగుతున్న వేళ రాజకీయ పార్టీల ర్యాలీలను ఎందుకు అడ్డుకోలేదని ధర్మాసనం నిలదీసింది.

‘‘ప్రస్తుత ఈ పరిస్థితికి కేవలం కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి… మీకున్న ఏ విధమైన విశేష అధికారాన్ని వినియోగించుకోలేదు..‘కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించండి, కోవిడ్ ప్రోటోకాల్‌ పాటించండి’ అని పదే పదే ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ భారీ ర్యాలీలు నిర్వహించిన రాజకీయ పార్టీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఈ సమయంలో మీరు మరో గ్రహంపై ఉన్నారా’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ ఓట్ల లెక్కింపు విషయంలో తీసుకునే కోవిడ్ ప్రోటోకాల్‌పై తమకు స్పష్టమైన ప్రణాళిక అందజేయకపోతే మే 2న కౌంటింగ్ ఆపివేస్తాం.. ఆలోగా బ్లూప్రింట్ సమర్పించాలి.. మే 2 న ఫలితాలు మహమ్మారి మరింత ఉప్పెనగా మారడానికి దోహదపడతాయి.. లెక్కింపు సమయంలో కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తున్నారా? లేదా.. ప్రజారోగ్యానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. రాజ్యాంగ అధికారులకు ఈ విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది.

పౌరుడు జీవించి ఉన్నప్పుడే ఇతర రాజ్యాంగ హక్కులను అనుభవిస్తాడని ఈ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం అతనికి హామీ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితిలో మనుగడ.. రక్షణకే తొలి ప్రాధాన్యత.. మిగతావన్నీ రెండో స్థానంలో ఉన్నాయి’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో కోవిడ్ నిబంధనలు పాటించలేదని, లెక్కింపు రోజున కచ్చితంగా వాటిని అమలు చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడులోని కరూర్ నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్లీజ్ అలీగారూ!! మా మొర వినరా? హీరో వడ్డే నవీన్‌ కోసం ఎంత కాలం ఎదురుచూడాలి?

Mon Apr 26 , 2021
హీరోగాా 28 సినిమాల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్న వడ్డే నవీన్.. నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేశారు.