ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులో చెన్నై వెళుతున్నారా.. మీకో అలర్ట్, ఇది తప్పనిసరి

శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేశారని.. ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఏపీపీటీడీ ఆర్‌ఎం పీవీ శేషయ్య తెలిపారు.

ప్రధానాంశాలు:తమిళనాడు వెళ్లాలంటే ఈ-పాస్ కావాల్సిందేఆర్టీసీ బస్సు ప్రయాణికులకు తప్పనిసరివివరాలు వెల్లడించిన ఏపీపీటీడీ ఆర్ఎందేశవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. కొన్నిచోట్ల లాక్‌డౌన్ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణతో పాటూ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీలో కూడా రాత్రి కర్ఫ్యూ విధించారు.. శనివారం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవలు మినహా మిగిలినవి ఏవీ పని చేయవు. ఇదిలా ఉంటే తమిళనాడు కూడా ఆంక్షలు విధించింది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆర్టీసీ బస్సుల్లో తమిళనాడుకి ప్రయాణించేవారు ఈ–పాస్‌ను తప్పనిసరిగా పొందాలని ఏపీపీటీడీ ఆర్‌ఎం పీవీ శేషయ్య తెలిపారు. శనివారం రాత్రి నుంచి ఆంక్షలను కఠినతరం చేశారని.. ఇకపై ఏపీ, కర్ణాటక, కేరళతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ పాస్‌ పొందాలని ఆదేశించినట్లు చెప్పారు. ప్రయాణికులు https.eregister.tnega.org వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకుంటే వారి ఫోన్‌ నంబర్‌కు ఈ పాస్‌ మెసేజ్‌ వస్తుందన్నారు. నెల్లూరు రీజియన్‌ నుంచి చెన్నై వెళ్లేవారు వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వచ్చే నెలలో బ్యాంక్ సెలవులు ఇవే! టైమింగ్స్‌లోనూ మార్పు?

Mon Apr 26 , 2021
మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? అయితే మీరు కచ్చితంగా ఒక విషయం తెలుసుకోవాలి. మే నెలలో బ్యాంక్‌లకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం.