డిస్కవరీ ఛానెల్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు డాక్యుమెంటరీ.. ఎప్పుడంటే..

Telangana News: గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నదిలో నీరు పారే దిశకు వ్యతిరేక దిశలో వందల కిలోమీటర్ల చొప్పున నీటిని ఎత్తిపోసి పంట పొలాలకు నీరు అందిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానాంశాలు:కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో గుర్తింపుప్రత్యేక డాక్యుమెంటరీ రూపకల్పనడిస్కవరీ ఛానెల్‌లో ఈ నెల 25న..ప్రపంచంలో అతి పెద్దదయిన ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. అత్యంత భారీ తనంతో రూపొందిన ఈ కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందింది. దీనిని ఈ నెల 25వ తేదీన డిస్కవరీ ఛానల్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయనుంది. ‘లిఫ్టింగ్‌ ఎ రివర్‌’పేరుతో గంటపాటు సాగనున్న ఈ డాక్యుమెంటరీ శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రసారం కానుంది. గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును నదిలో నీరు పారే దిశకు వ్యతిరేక దిశలో వందల కిలోమీటర్ల చొప్పున నీటిని ఎత్తిపోసి పంట పొలాలకు నీరు అందిస్తున్న సంగతి తెలిసిందే.

2017లో ఈ బృహత్తర పథకం మొదలుపెట్టింది మొదలు ఇప్పటివరకు జరిగిన పనులను చూపుతూనే, బృహత్తర యజ్ఞాన్ని పూర్తి చేసే క్రమంలో ఎదురైన అనుభవాలను ఈ డాక్యుమెంటరీలో చూపనున్నారు. ఇంగ్లిష్‌, హిందీ సహా ఆరు భారతీయ భాషల్లో దీనిని ప్రసారం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ ట్వీట్ చేసి ప్రకటించింది.

NTR లో నాకు బాగా నచ్చింది అదే.. దాన్నే మనం ఇలా చేశాం: కేసీఆర్
మూతికో బట్ట.. ము**కో గుడ్డ.. ఇదేం ఖర్మ, వాళ్లని దొరకబట్టి బండకు కొట్టుర్రి: కేసీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీ వాసులకు గుడ్‌న్యూస్! తెలంగాణ కీలక నిర్ణయం, రేపటి నుంచే..

Sun Jun 20 , 2021
TSRTC: ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏపీకి తెలంగాణ బస్సులు నడవనున్నాయి.