Jagamae Thandhiram.. సోషల్ మీడియాలో ధనుష్ ట్రెండ్

ధనుష్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన జగమే తంత్రం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు ఈ సినిమా 190 దేశాల్లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రధానాంశాలు:ఓటీటీలో ధనుష్ సినిమాజగమే తంత్రం అంటూ రచ్చసోషల్ మీడియాలో ధనుష్ ట్రెండ్ధనుష్ కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్‌లో వచ్చిన జగమే తంత్రం సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు ఈ సినిమా 190 దేశాల్లో విడుదలైంది. నెట్ ఫ్లిక్స్ భారీ రేటుకే ఈ చిత్రాన్ని సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఆ చిత్రయూనిట్ కూడా గట్టిగానే ప్రమోషన్స్ చేసింది. అలా మొత్తానికి నిన్న మధ్యాహ్నం నుంచి జగమే తంత్రం సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినా కూడా ధనుష్ హవా మాత్రం ఇంకా తగ్గడం లేదు. ట్విట్టర్‌లో జగమేతంత్రం హవా ఇంకా కొనసాగుతూనే ఉంది.

సాధారణ కథ, ఇంతకు ముందే ఎన్నో సార్లు చూసిన చిత్రంగా అనిపిస్తుంటుంది. తమిళ శరణార్థుల కోసం లండన్‌లో పోరాడే ఓ గ్యాంగ్ స్టర్ కథగా జగమే తంత్రాన్ని మలిచారు. ఇందులో కథ పర్వాలేదనిపించినా కూడా కథనం అంతగా రక్తికట్టలేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిజం చుట్టూనే కథను అల్లాడనే కామెంట్లు కూడా వచ్చాయి.
HappyBirthdayKajal.. మలుపుతిప్పిన ‘మగధీర’.. నెంబర్ వన్ హీరోయిన్‌గా హవా!
అయితే ఓటీటీలో వస్తున్న మూవీలన్నీ కూడా నిరాశ పరుచుతుండటంతో సినీ ప్రేమికులు నిరాశపడుతున్నారు. జగమే తంత్రం ఎలా ఉన్నా కూడా అభిమానులను మాత్రం ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నట్టుంది. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం జగమే తంత్రం హవా కొనసాగుతోంది. మాస్ హీరోయిజాన్ని తన స్టైల్లో చూపించడంతో ధనుష్ మరోసారి నిరూపించుకున్నాడంటూ కామెంట్లు వస్తున్నాయి. మొత్తానికి జగమే తంత్రం ఓ మోస్తరుగా పర్వాలేదనే టాక్‌ను సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్‌లో జగమే తంత్రం వ్యూస్ పరంగా రికార్డులు క్రియేట్ చేసేలానే కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అధికారుల అవినీతిపై ఆరోపణలు.. యువ ఐఏఎస్‌‌ను చంపుతామని బెదిరింపులు

Sat Jun 19 , 2021
రాష్ట్రంలోని అధికారుల అవినీతి గురించి ఓ ప్రయివేట్ మేసేజింగ్ గ్రూప్‌లో ఐఏఎస్ అధికారి చేసిన ఆరోపణలు మధ్యప్రదేశ్‌లో సంచలనంగా మారడంతో ఆయనకు ప్రభుత్వం నోటీసులు జారీచేసింది.