కరోనా టైమ్‌లో ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారి అకౌంట్లలోకి రూ.5 వేలు!

కరోనా కేసులు భారీగా పరిగిపోతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్‌ను వారం రోజులు పొడిగించింది. ఈనేపథ్యంలో కార్మికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వారికి రూ.5 వేలు అందిస్తోంది.

ప్రధానాంశాలు:ప్రభుత్వం కీలక నిర్ణయంవారికి రూ.5 వేలుబ్యాంక్ అకౌంట్లలో జమకరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తూ వస్తోంది. దీంతో కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా కోవిడ్ మరణాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది మళ్లీ ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడమే బటర్ అని చాలా మంది అనుకుంటున్నారు.

కోవిడ్ 19 దెబ్బకి పలు రాష్ట్రాలు మళ్లీ పాక్షిక లాక్ డౌన్ విధించాయి. ఇందులో ఢిల్లీ కూడా ఉంది. ఢిల్లీ లాక్ డౌన్‌ను మరో వారం రోజులపాటు పొడిగించింది. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బయట ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది. ఔషధాలు కూడా అందరికీ అందుబాటులో లేవు.

Also Read: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం ధర.. కొనేందుకు మంచి ఛాన్స్?

ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికులకు రూ.5 వేలు అందిస్తోంది. వారి బ్యాంక్ అకౌంట్లలోనే ఈ డబ్బులను నేరుగా జమ చేస్తోంది. దీంతో వీరికి ఊరట కలుగనుంది. ఇప్పటి వరకు సగం మందికి డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది.

రానున్న రోజుల్లో మిగిలిన వారందరికీ కూడా రూ.5 వేలు లభించనున్నాయి. లేబర్ బోర్డులో రిజిస్టర్ చేసుకున్న వారికే ఈ డబ్బులు లభిస్తాయి. అంతేకాకుండా ప్రభుత్వం వచ్చే 2 నుంచి 3 రోజుల్లో కన్‌స్ట్రక్షన్ వర్కర్ల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేయనుంది. స్కూల్స్, కన్‌స్ట్రక్చన్ సైట్లలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ ఆపేయండి.! కేంద్రానికి తమిళ సీఎం షాకింగ్ లేఖ

Sun Apr 25 , 2021
ఆక్సిజన్ కేటాయింపులపై తమిళనాడు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసింది. పెరంబూర్ నుంచి ఆక్సిజన్ కేటాయింపులను రద్దు చేయాలని కోరుతూ ప్రధాని మోదీకి సీఎం పళనిస్వామి లేఖ రాశారు.