బ్యాంకులపై కరోనా పంజా… తెలంగాణలో 3,238 మంది సిబ్బందికి పాజిటివ్

తెలంగాణలోని బ్యాంకుల్లో సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటివరకు 3వేలకు పైగా బ్యాంక్ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో బ్యాంకులకు వెళ్లేందుకు మిగిలినవారు ఆందోళన చెందుతున్నారు.

ప్రధానాంశాలు:తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనావైరస్ బారిన పడుతున్న బ్యాంక్ సిబ్బందివిధులకు వెళ్లేందుకు భయపడుతున్న మిగతావారుతెలంగాణలో కరోనా మహమ్మారి మరణ మృదంగం మోగిస్తోంది. గతేడాది కంటే భారీగా కేసులు, మరణాలు సంభవిస్తుండటంతో ప్రజలు హడలిపోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు పోలీసులు, ప్రభుత్వ అధికారులు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణలో బ్యాంకింగ్ వ్యవస్థపైనా కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3వేల మందికి పైగా బ్యాంకు సిబ్బందికి కరోనా సోకినట్లు సమాచారం. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో నేరుగా సంబంధాలు కలిగి ఉండే సిబ్బంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న కరోనా అడ్డుకోలేకపోతున్నారు.

Also Read: మరోసారి యశోద హాస్పిటల్‌కి కేసీఆర్?… లాక్‌డౌన్‌పై రెండ్రోజుల్లో కీలక నిర్ణయం

నగదు లావాదేవీలు, పేపర్ వర్క్స్ చేతులు మారడం కూడా వైరస్ వ్యాప్తికి ప్రధాన కారణమవుతుంది. ఏప్రిల్ నెలలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన 3,238 మంది ఉద్యోగులకు కరోనా సోకగా.. వీరిలో అత్యధికంగా 1,028 మంది ఎస్‌బీఐ ఉద్యోగులే ఉన్నారు. కరోనా వ్యాప్తి దృష్టిలో పెట్టుకొని బ్యాంకు పనివేళల్లో మార్పులు చేయాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది.

Also Read: మెట్రో నెత్తిన కరోనా పిడుగు… సగానికి పైగా తగ్గిపోయిన ప్రయాణికులు

మరోవైపు కరోనా బారిన పడుతున్న తమ ఉద్యోగులకు ఆయా బ్యాంకులు అండగా నిలుస్తున్నాయి. వీలైనంత వరకు డిజిటిల్ లావాదేవీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఖాతాదారులకు విజ్ఞప్తి చేస్తున్నాయి. కరోనా బారిన పడే తమ ఉద్యోగులకు హాస్పిటల్స్‌లో బెడ్లు లభించకపోతే సికింద్రాబాద్లోని తన ట్రైనింగ్ సెంటర్‌ను తాత్కాలిక ఆస్పత్రిగా మార్చాలని ఎస్బీఐ నిర్ణయించింది. మిగిలిన బ్యాంకులు కూడా తమ ఉద్యోగులకు తగిన చికిత్స లభించేలా చర్యలు తీసుకుంటున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో నలుగురు మహిళల మిస్సింగ్… అంతుబట్టని కారణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో కరోనా రోగులు కోలుకున్నా ఆస్పత్రుల్లో చికిత్స.. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీరియస్!

Mon Apr 26 , 2021
కరోనా వైరస్ నుంచి రోగులు కోలుకున్నా కూడా వారిని డిశ్చిర్జి చేయని ఆస్పత్రులపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీరియస్ అయ్యింది.