రష్యా: ప్రయాణికులతో వెళ్తోన్న విమానం గల్లంతు.. సముద్రంలో కూలినట్టు అనుమానం

ప్రయాణికులతో బయలుదేరిన ఓ విమానం నిర్ణీత సయమానికి చేరుకోకపోవడంతో ఏటీసీతో సంబంధాలు తెగిపోవడంతో కూలిపోయినట్టు అనుమానిస్తున్నారు.

ప్రధానాంశాలు:నిర్దేశిత సమయానికి గమ్యం చేరని విమానం ఏటీసీతో ఫ్లైట్‌కు తెగిపోయిన సంబంధాలు. గాలింపు కోసం రంగంలోకి సైనిక హెలికాప్టర్లు.ప్రయాణికులతో వెళ్తున్న విమానం గల్లంతయిన ఘటన రష్యాలో చోటుచేసుకుంది. రష్యా తూర్పు ప్రాంతం పెట్రోపవ్లోస్క్‌- కామ్‌చట్‌స్కీ నుంచి కామ్‌చట్కా ద్వీపంలోని పలానాకు బయలుదేరిన ఏఎన్-26 విమానానికి ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ఈ విమానం పలానాలో షెడ్యూల్‌ ప్రకారం ల్యాండింగ్‌ కూడా జరగలేదు. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానం కోసం గాలిస్తున్నారు. తప్పిపోయిన విమానంలో 22 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది సహా మొత్తం 28 మంది ఉన్నారు.

వీరిలో కొందరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. విమానం సముద్రంలో కూలిపోయిందేమోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేకపోతే పలానా పట్టణం సమీపంలోని ఓ బొగ్గు గని ప్రాంతంలో కూలిపోయి ఉండొచ్చని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విమానం ఆచూకీ కనిపెట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. రెండు హెలికాప్టర్లు సాయంతో గాలింపు చేపట్టారు. ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతాలకు సహాయక సిబ్బందిని తరలిస్తున్నారు.

ఒకప్పుడు విమాన ప్రమాదాలకు చిరునామా నిలిచిన రష్యా.. ఇటీవల కాలంలో ఎయిర్ ట్రాఫిక్ వ్యవస్థను ఆధునీకరించి ప్రమాదాలు జరగక్కుండా చర్యలు తీసుకుంటోంది. కానీ, భద్రత ప్రమాణాలను పాటించడంలో విఫలం కావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యాలో చివరిసారిగా 2019 మేలో సుఖోయ్ యుద్ధ విమానం రన్‌వై క్రాష్ ల్యాండింగ్ జరగడంతో మంటలంటుకుని 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.

అంతకు ముందు 2018 ఫిబ్రవరిలో మాస్కో వద్ద సరటోవ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఏఎన్-148 విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోవడంతో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని దర్యాప్తులో వెల్లడయ్యింది. రష్యాలోని క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు కూడా విమాన ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వేశ్యగా సోనాక్షి సిన్హా.. ఆయనతో అనగానే వెంటనే ఓకే! బాలీవుడ్ బ్యూటీ డేరింగ్ డిసీజన్

Tue Jul 6 , 2021
బాలీవుడ్‌ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు. ‘హీరామండి’ అనే పేరుతో భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ వెబ్‌ సిరీస్‌‌లో‌ సోనాక్షి సిన్హా వేశ్యగా కనిపించనుందట.