కౌశిక్ రెడ్డికి షాక్..షోకాజ్ నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్

కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం పేర్కొంది.

ప్రధానాంశాలు:కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ షాక్షోకాజ్ నోటీసులు జారీ 24 గంటల్లో సమాధానం ఇవ్వలన్న క్రమశిక్షణా సంఘం కాంగ్రెస్‌ నేతకౌశిక్‌రెడ్డి వ్యవహారంలో పార్టీలో కలకలం రేపింది. పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తమ్ముడి వరుసయ్యే కౌశిక్ రెడ్డి.. టీఆర్ఎస్ టికెట్ తనకేనంటూ మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది.
దీంతో ఆయనపై కాంగ్రెస్ పార్టీ చర్యలకు సిద్ధమైంది. హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం పేర్కొంది. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టిఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యాదులు అందాయి.

గతంలోనే కౌశిక్ రెడ్డిని క్రమశిక్షణ సంఘం పిలిచి హెచ్చరించినా ఆయన తీరు మారలేదు. దీంతో 24 గంటల్లోగా ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని నోటీసులో క్రమశిక్షణ సంఘం పేర్కొంది.
లేనిపక్షంలో తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మరోవైపు కాంగ్రెస్‌ నేత కౌశిక్‌రెడ్డి వాయిస్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తనకే టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఇస్తుందని ఫోన్ల ద్వారా కౌశిక్‌రెడ్డి స్థానిక నాయకుల వద్ద చెప్తున్నట్టు వైరలైన ఆడియో క్లిప్‌ ద్వారా తెలుస్తోంది.

రానున్న ఉపఎన్నికల్లో తానే టీఆర్‌ఎస్‌ అభ్యర్థినంటూ కౌశిక్‌రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. మాదన్నపేట్‌కు చెందిన యువకుడితో కౌశిక్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. యూత్‌కు మూడు నుంచి ఐదువేల వరకు ఇస్తానని.. ఖర్చులు తాను చూసుకుంటానని కౌశిక్ రెడ్డి చెప్పడం గమనార్హం.దీంతో ఇప్పుడు ఆయన ఆడియో వ్యవహారం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

IND vs SL సిరీస్‌కి లైన్ క్లియర్.. శ్రీలంక క్రికెటర్లు పాస్

Mon Jul 12 , 2021
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య సిరీస్‌కి మార్గం సుగుమమైంది. లంక టీమ్‌లో కరోనా కేసులు నమోదవడంతో.. ఐదు రోజులు వాయిదాపడిన సిరీస్ 18 నుంచి స్టార్ట్ కాబోతోంది.