సిద్ధిపేటకు సీఎం.. నేటి నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన

ఇవాళ ఉదయం సీఎం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో జిల్లాల పర్యటనకు బయల్దేరనున్నారు. ముందుగా సిద్ధిపేటలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని కామారెడ్డి వెళ్లనున్నారు.

ప్రధానాంశాలు:సిద్ధిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం మధ్యాహ్నం కామారెడ్డిలో పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోనున్న సీఎం సీఎం కేసీఆర్ ఇవాల్టి నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల అమలు తీరు, పురోగతిని స్వయంగా పరిశీలించేందుకు ఆయన జిల్లాల్లో పర్యటించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. ఆదివారం ఉదయం సిద్దిపేట, మధ్యాహ్నం కామారెడ్డి జిల్లాల్లో, సోమవారం వరంగల్‌ జిల్లాలో సీఎం పర్యటిస్తారు.

ఉదయం 11.10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి సీఎం సిద్దిపేటకు చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం సిద్దిపేట శివారులో నిర్మించిన పోలీస్‌ కమిషరేట్‌ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభింస్తారు. తదుపరి సమీకృత జిల్లా కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేసి, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం కామారెడ్డిలో సమీకృత కలెక్టర్‌ కార్యాలయ భవనాన్ని, తదుపరి జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.

అనంతరం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగంతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. భిక్కనూరు మండలంలోని జంగంపల్లిలోని డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలనూ సీఎం ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, తిరుగు ప్రయాణంలో ఏ గ్రామాన్ని అయినా ఆకస్మికంగా సందర్శించవచ్చనే సమాచారంతో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమవుతోంది.

ఈ నెల 21న వరంగల్‌ జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ నిర్మించిన జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని ప్రారంభించడంతోపాటు వరంగల్‌ సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మించనున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఈనెల 22న భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని తన దత్త గ్రామమైన వాసాలమర్రిని సీఎం సందర్శించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలంగాణలో అన్ లాక్.. ఏపీకి మాత్రం నో పర్మిషన్

Sun Jun 20 , 2021
తెలంగాణలో అన్ లాక్ ప్రక్రియ ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. అయితే పలు రాష్ట్రాలకు వెళ్లే బస్సులు మాత్రం ఇంకా నడవడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉండటంతో... అంతర్ రాష్ట్ర సర్వీసులు నిలిచిపోయాయి.