ఇవాళ మరోసారి కేబినెట్ భేటీ.. ఉద్యోగాల భర్తీకి ఆమోదం

ఉద్యోగాల భర్తీ విషయంలో ఇవాళ మంత్రివర్గ కీలక నిర్ణయం తీసుకోనుంది. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన అంశంపై కేబినెట్ చర్చించనుంది.

ప్రధానాంశాలు:ఇవాళ మళ్లీ భేటీ కానున్న కేబినెట్ ఉద్యోగాల భర్తీపై చర్చ కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీ ఇవాళ మరోసారి తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగనుంది. ఈ భేటీకి మంత్రులు హాజరు కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఉద్యోగాల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపుపై చర్చ జరగనుంది. ఇందులో భాగంగా.. పూర్తి వివరాలతో కేబినెట్‌ సమావేశానికి హాజరుకావాలని అన్ని శాఖ కార్యదర్శులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. కొత్త జోనల్‌ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు, ఖాళీల గుర్తింపు కొరకు కూడా కేబినెట్ భేటీ కానుంది.

ఇవాళ భేటీకి పూర్తి వివరాలతో అన్నిశాఖల కార్యదర్శులు హాజరవ్వాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాల వారీగా పోస్టులు, అధికారుల కేటాయింపు సత్వరమే చేపట్టాలని కేబినెట్‌ నిర్ణయించింది. అన్ని శాఖల్లోని ఖాళీలతో ప్రతి ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి రేపు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

Wed Jul 14 , 2021
వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలక తోడుగా ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని అధికారులు తెలిపారు.