PV Sindhu హైట్ మీద ‘చిరు’ హాస్యం.. రానా ఎంట్రీతో ‘మెగా’ సెటైర్లు!

మెగాస్టార్ చిరంజీవిలోని చతురత గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై ఎంత చమత్కారంగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే ఉంటారు. ఇక ఆ మధ్య ట్విట్టర్‌లో ఆయన దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు.

ప్రధానాంశాలు:ఒలింపిక్‌లో పీవీ సింధు విజయంసత్కరించిన మెగాస్టార్ చిరంజీవిపీవీ సింధు ఎత్తుపై చిరు సెటైర్మెగాస్టార్ చిరంజీవిలోని చతురత గురించి అందరికీ తెలిసిందే. ఆయన తెరపై ఎంత చమత్కారంగా ఉంటారో నిజ జీవితంలోనూ అంతే ఉంటారు. ఇక ఆ మధ్య ట్విట్టర్‌లో ఆయన దూకుడు చూసి అందరూ షాక్ అయ్యారు. ఒక్కొక్కరి మీద ఆయన వేసిన పంచ్‌లు, వేసిన మీమ్‌లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా ఒలింపిక్ పతకాన్ని సాధించిన పీవీ సింధును అందరి సమక్షంలో చిరంజీవి సత్కరించారు. దీనికి సంబంధించి ఓ గ్రాండ్ ఈవెంట్‌ను తన ఇంట్లోనే ఏర్పాటు చేశారు చిరంజీవి.

పీవీ సింధును సత్కరించే ఈ కార్యక్రమానికి చిరంజీవి తన బంధుమిత్రులందరినీ పిలిచారు. ఇండస్ట్రీ నుంచి దాదాపు తన స్నేహితులందరినీ పిలిచారు. నాగార్జున, సుహాసిని, రాధిక ఇలా అందరినీ ఆహ్వానించారు. ఇక అల్లు అరవింద్ ఎలాగూ ఉంటారు. రామ్ చరణ్ తన ఫ్రెండ్స్‌ను పిలుచుకున్నట్టున్నారు. శర్వానంద్, రానా, అఖిల్ ఇలా అందరూ కూడా ఆ పార్టీలో కనిపించారు.
View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)
అయితే తాజాగా చిరంజీవి పీవీ సింధును సత్కరించిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. అందులో ఓ చోట పీవీ సింధు హైట్ మీద చిరు కామెంట్ వేశారు. అసలే సింధు చిరంజీవి కంటే ఎంతో ఎత్తు ఉంటుంది. మామూలుగా ఆమె పక్కన ఎవ్వరూ నిల్చున్నా కూడా పొట్టిగానే కనిపిస్తుంటారు. కానీ రానా ఎంట్రీతో చిరుకు ధైర్యం వచ్చినట్టుంది. నీ హైట్‌కు తగ్గవాడు ఇప్పుడు వచ్చాడు అంటూ రానాను చూపిస్తూ సింధు మీద సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

NET : మా సినిమాకి **లో దమ్ముంది.. దారుణమైన కామెంట్లు చేసిన రాహుల్ రామకృష్ణ

Sun Aug 29 , 2021
రాహుల్ రామకృష్ణ నటుడిగానే కాకుండా విలన్‌గానూ మెప్పిస్తున్నారు. ఇక లీడ్ రోల్స్‌లోనూ రాహుల్ రామకృష్ణ తన స్టైల్లో దూసుకుపోతోన్నారు. ఇక రాహుల్ రామకృష్ణ త్వరోలనే NET అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు.