సీఎం సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాశ్‌‌‌ ఓవరాక్షన్… సీఎస్ దాస్ దిమ్మతిరిగే రియాక్షన్

ప్రస్తుతం ఏపీభవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్‌ త్రిపాఠి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ ఏపీభవన్‌కు వెళ్తారనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది

ప్రధానాంశాలు:జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి పోస్టు కట్‌సీఎం కార్యాలయ కార్యదర్శిగా పరిమితంముత్యాలరాజుకు ఆ బాధ్యతలు అప్పగింతముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ అధికారాలకు కత్తెర పడింది. కొంతకాలంగా తానే సీఎం, తానే సీఎస్‌ అన్న రీతిలో ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహరిస్తున్నట్లు అధికార వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. సీఎం కనుసన్నల్లో నడుస్తూ ఇతర అధికారులను వేధింపులకు గురిచేస్తున్న ఆయనపై చివరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు కూడా ఆగ్రహం కలిగింది. ఫలితంగా ఆయన చెలాయిస్తున్న అధికారాలకు కోత విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

Also Read: ‘సీఎం జగన్‌ బెయిల్‌ రద్దు’… ఉలిక్కిపడిన వైసీపీ, రంగంలోకి సీఐడీ

సాధారణంగా సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులెవరికీ ఇతర శాఖల బాధ్యతలు ఇవ్వరు. కానీ, ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్‌గా ఉన్నప్పుడు కొన్ని రకాల ఉత్తర్వులు జారీచేయడానికి అంగీకరించలేదు. దీంతో సీఎస్‌ జారీచేయాల్సిన ఆదేశాలను సీఎం అనుమతితో జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ ఇవ్వవొచ్చంటూ ప్రవీణ్‌ప్రకాశ్‌ తానే ఒక జీవో జారీచేశారు. అప్పటికి ఆయన సీఎం ముఖ్య కార్యదర్శితో పాటు పొలిటికల్‌ సెక్రటరీ బాధ్యతల్లో కూడా ఉన్నారు. దాంతో ఒక్క జీవోతో రెండు కీలకమైన బాధ్యతలు దక్కించుకున్నట్లయింది. కీలక అధికారుల నియామకం విషయంలో ప్రవీణ్‌ ప్రకాశ్‌ సొంత ధోరణితో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి జగన్‌ని సైతం తప్పుదారి పట్టించారని అధికారుల నుంచి ఫిర్యాదులు వెళ్లాయి.

ఇదే విషయంలో ఎల్వీ సుబ్రమణ్యంతో విభేదించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆయన తొలగింపులో కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎస్‌‌గా వచ్చిన నీలం సాహ్ని ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడంతో ఎలాంటి సమస్యా తలెత్తలేదు. అయితే ప్రస్తుత సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌కు ప్రవీణ్‌ ప్రకాశ్‌ వ్యవహారశైలి అస్సలు నచ్చడం లేదట. దీనిపై ఆయన కొన్ని సందర్భాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో జగన్‌ కూడా ప్రవీణ్ ప్రకాశ్‌ వ్యవహారశైలిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read: అప్పుల ఆంధ్రప్రదేశ్… మరో రూ.1,750 కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం

ప్రస్తుతం ఏపీభవన్‌ ముఖ్య రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న అభయ్‌ త్రిపాఠి ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన స్థానంలో ప్రవీణ్‌ప్రకాశ్‌ ఏపీభవన్‌కు వెళ్తారనే ప్రచారం అధికార వర్గాల్లో జరుగుతోంది. ఈలోపే ఆయన అధికారాలకు కత్తెర వేయడం హాట్‌టాపిక్‌గా మారింది. జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీ హోదాలో ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలు కొన్నింటిని సీఎస్‌ తప్పుబట్టినట్లు తెలుస్తోంది. కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతున్న అంశంపై కొద్దిరోజుల క్రితం ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఇందులో కూడా ప్రవీణ్‌ నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. దీంతో ఆయన అధికారాలకు కత్తెర వేయాల్సిందేనని సీఎస్‌ పట్టుబట్టడంతో ముఖ్యమంత్రి జగన్ ఆమోదముద్ర వేయక తప్పలేదని సమాచారం. సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్న రేవు ముత్యాలరాజుకు జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆధార్ కార్డు ఉన్న వారికి హెచ్చరిక.. కేంద్రానికి హైకోర్టు నోటీసులు!

Wed Jul 14 , 2021
ఆధార్ కార్డు లింక్‌తో ఇప్పుడు యూఐడీఏఐకి కొత్త చిక్కులు వచ్చాయి. ఒక వ్యక్తి ఆధార్ నెంబర్ ఆయనకు తెలియకుండానే విదేశాల్లోని రెండు కంపెనీలతో అనుసంధానం అయ్యింది. దీంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కారు.