కోట్లలో మోసం.. సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు.. ఆయనతో పాటు మరో ఏడుగురిపై ఫిర్యాదు!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్‌ పోలీసులు సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు ఫైల్ చేశారు.

ఈ మధ్యకాలంలో సినీ నటులపై పోలీస్ కేసులు నమోదు కావడం ఎక్కువగా కనిపిస్తోంది. వాళ్ళ ద్వారా ఏ చిన్న ఇబ్బంది కలిగినా, ఏదైనా ఇష్యూలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సినీ నటుల భాగస్వామ్యం ఉన్నా వాళ్లపై పోలీస్ కేసు పెట్టేస్తున్నారు బాధితులు. ఈ నేపథ్యంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు నమోదైంది. అరుణ్‌ గుప్తా అనే వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చండీగఢ్‌ పోలీసులు సల్మాన్‌ ఖాన్‌పై చీటింగ్‌ కేసు ఫైల్ చేశారు.

సల్మాన్‏ ఖాన్, ఆయన సోదరి అల్విరా ఖాన్ అగ్నిహోత్రితో పాటు ఆయనకు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ చెందిన ఏడుగురు వ్యక్తులపై సదరు వ్యాపారి ఫిర్యాదు చేశాడు. ఇద్దరు బీయింగ్ హ్యూమన్ ఉద్యోగులు ఆ సంస్థ ఫ్రాంచైజీని తెరవమని అడిగారని, అందుకోసం పెట్టుబడి ఖర్చు 2 కోట్లకు పైగా అవుతుందని చెప్పగా అందుకు అంగీకరించి అంత మొత్తాన్ని ఖర్చు పెట్టానని, చివరకు వాళ్ళు మోసం చేశారంటూ అరుణ్‌ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

'బీయింగ్ హ్యూమన్ జువెల్లరీ' పేరుతో షోరూమ్ తెరచి సంవత్సరం దాటిపోయినా సదరు సంస్థ నుంచి తనకు రావాల్సిన మెటీరియల్ ఏదీ రాలేదని, మొదట్లో ఈ విషయమై ఆ సంస్థ ఉద్యోగులు సల్మాన్ ఖాన్‏తో సమావేశం అయ్యేలా చూస్తామని చెప్పారని.. ఆ తర్వాత సల్మాన్‏ ఫ్రాంచసీ ప్రారంభించేందుకు కూడా వస్తానని హామీ ఇచ్చి చివరకు రాలేదని అరుణ్ గుప్తా తెలిపాడు. దీంతో సల్మాన్, ఆయన సోదరి అల్విరా, సదరు సంస్థ సీఈఓ ప్రకాశ్ కాపరే సహా మరో ఏడుగిరిపై అరుణ్ ఫిర్యాదు చేశాడు.
మా మరదలు అనుమానించి తేడాగా చూసేది.. ఆడాళ్లు బూతులు తిట్టేవారు: తనికెళ్ల భరణి
కాగా ఈ కేసు విషయమై జూలై 13వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేశారు. అరుణ్ ఆరోపణలపై సరైన విచారణ చేపడుతున్నామని, ఒకవేళ వాళ్లపై నేరం రుజువైతే తప్పక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేతన్ బన్సాల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

YS Sharmila: షర్మిల సభలో చోరి.. కీలక నేత మొబైల్ మిస్సింగ్

Fri Jul 9 , 2021
గురువారం షర్మిల తన పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారిక ప్రకటన చేశారు. అయితే ఇదే అదనుగా సభలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు.