పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్​​ సింగ్.. కాంగ్రెస్ దళిత మంత్రం, అదిరే మాస్టర్ ప్లాన్!

పంజాబ్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభానికి తెరపడింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేత నియమితులయ్యారు.

పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠ తెరపడింది. పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఎంపికయ్యారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన 24 గంటల్లోనే చరణ్‌జిత్ చన్నీని తదుపరి సీఎంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చరణ్‌జిత్ చన్నీకి సమాచారం ఇవ్వడం.. ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు తనను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరేందుకు అపాయింట్మెంట్ అడగడం చకచకా జరిగిపోయాయి.

కాగా, ముఖ్యమంత్రి రేసులో పీసీపీ అధ్యక్షుడు నవ్యజోత్ సింగ్ సిద్దూ ముందున్నా.. కెప్టెన్ అమరీందర్ ఆయనకు వ్యతిరేకంగా ఉండటంతో కలిసిరాలేదు. దీంతో అధిష్టానం చరణ్‌జిత్ చన్నీ వైపు మొగ్గు చూపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్ రావత్ కొత్త సీఎం ఎంపిక వివరాలను మీడియా వెల్లడించారు. చరణ్‌జిత్ చన్నీని పంజాబ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించడం ఆనందంగా ఉందని వివరించారు.

చరణ్‌జిత్ చన్నీ నేపథ్యం ఇదీ..
చరణ్‌జిత్ చన్నీ (47) పంజాబ్ ప్రభుత్వంలో టెక్నికల్ ఎడ్యుకేషనల్ & ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మంత్రిగా పనిచేశారు. చంకౌర్ సాహిబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2015 నుంచి 2016 వరకు పంజాబ్ విధాన సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. చరణ్‌జిత్ రామదాసియా సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చరణ్‌జిత్.. 47 సంవత్సరాల వయసులో అమరీందర్ సింగ్ కేబినెట్‌లో మంత్రిగా నియమితులయ్యారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రిగా జాక్‌పాట్ కొట్టేశారు. కాగా, త్వరలో పంజాబ్ ఎన్నికలు జరగనుండటం, దేశవ్యాప్తంగా బలమైన ఎస్సీ సామాజిక వర్గం ఓట్లను ఆకర్షించేందుకు గాను కాంగ్రెస్ పార్టీ దళిత ముఖ్యమంత్రిని నియమించినట్లు విశ్లేషణలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

కాంగ్రెస్ అడ్డాలో ఏకమైన నేతలు.. సర్కార్‌‌పై సమరానికి సై, వ్యూహాత్మకంగా రేవంత్ అడుగులు!

Sun Sep 19 , 2021
కేసీఆర్ సర్కార్ విధానాలపై పోరాటాలకు సిద్ధమవుతున్నాయి ప్రతిపక్షాలు. కాంగ్రెస్ కొత్త చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై కేసీఆర్ సర్కార్‌పై సమరమేనని తేల్చి చెప్పారు.