సీఎం జగన్‌కు ఊహించని షాక్.. బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు సంచలన నిర్ణయం

జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్ వేశారు.. దీనిపై కోర్టు విచారణ జరపగా.. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. జడ్జి ఇవాళ విచారణ జరపాలా లేదా అన్నదానిపై తీర్పును వెలువరించారు.

ప్రధానాంశాలు:జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ పిటిషన్పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టుసోషల్ మీడియా ద్వారా తెలియజేసిన ఎంపీఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు ఈ పిటిషన్ వేశారు.. దీనిపై కోర్టు విచారణ జరపగా.. పిటీషన్ అర్హతపై కోర్టులో వాదనలు జరిగాయి. జడ్జి ఇవాళ విచారణ జరపాలా లేదా అన్నదానిపై తీర్పును వెలువరించారు. ఈ విషయాన్ని ఎంపీ రఘురామకృష్ణ రాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 11 చార్జ్ షీట్లను సీబీఐ నమోదు చేసిందని ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతి చార్జ్‌షీట్‌లో జగన్ ఏ-1గా ఉన్నారని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలని పిటిషన్ వేసినట్టు పేర్కొన్నారు. రఘురామ జగన్‌పై నమోదైన కేసులను త్వరగతిన విచారణ పూర్తి చేయాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
రేయ్ ఏమన్నార్రా, ముందుంది మొసళ్ల పండగ.. ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు సీఎం జగన్ నిర్దోషిలా బయటపడాలన్నదే తన ఉద్దేశమని ఎంపీ రఘురామ అన్నారు. వైఎస్సార్‌సీపీని రక్షించుకునే బాధ్యత ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా తనపై ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో త్వరలో తిరుపతి ఎన్నిక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్న తరుణంలో సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ వేసిన పిటిషన్ చర్చనీయాంశమైంది.
గుంటూరు: సంగం డెయిరీ విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం శ్రీకాకుళం: అయ్యో పాపం, ఎవరికీ రాకూడని కష్టం.. కన్నీళ్లు పెట్టించేలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ఆ వివాదాస్పద పరిశ్రమ తెరవడానికి సుప్రీం అనుమతి!

Tue Apr 27 , 2021
ఆక్సిజన్ కోరతను అధిగమించడానికి పరిశ్రమలకు సరఫరా నిలిపివేసి ఆస్పత్రులకే అందజేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశంలోని స్టీల్ ప్లాంట్ల నుంచి ప్రాణవాయువును సరఫరా చేస్తున్నారు.