యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాటకు మంచి స్పందన వచ్చింది. బాగా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా చంద్రబోస్ అందించిన సాహిత్యం చాలా బాగుంది.

నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం ‘V’. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్లు. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మాతలు.

తమిళ్ హిట్ సినిమా 96లో కాదలే కాదలే సాంగ్ ఎంత పెద్ద హిట్టో చెప్పాల్సిన పనిలేదు. అంతే హృద్యంగా సంగీతమందిచారు గోవింద్ వసంత. శ్రీమణి రాసిన లిరిక్స్ … భావాన్ని లోతుగా విశ్లేషిస్తే మదిని తడుపుతున్నాయి. బరువెక్కిస్తున్నాయి.

అల వైకుంఠపురములో క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌ను త్రివిక్రమ్ తెరకెక్కించిన తీరు అందరిని ఆకట్టుకుంది. పల్లెటూరి బాణీలతో సాగే సిత్తరాల సిరపడు అనే సాంగ్‌కు ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్‌లు కంపోజ్ చేసిన ఫైట్ వావ్ అనిపించింది. ఆ సాంగ్‌ లిరిక్స్ ఊపేస్తున్నాయి.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్. టబు కీలక పాత్రలో నటించారు.

'బుగ్గలు రెండు జాంపండులా ఉన్న వాడే తన మొగుడనీ'.. రష్మిక ఎగిరిగంతేస్తూ.. 'హీజ్ సో క్యూట్ 'అంటూ.. మహేష్ బాబుని అల్లరిపెడుతోంది. ఈ సాంగ్‌ చాలా బాగా పాడిందని సింగర్ మధుప్రియకు పొగడ్తల వర్షం కురుస్తోంది. అబ్బాయిల అందం మీద ఒక్క పాట కూడా సరిగ్గా లేదే… వీడి ముందు అందం కూడా బలాదూరే అన్నట్లు సూపర్ స్టార్‌కి ఫర్‌ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా లిరిక్స్ రాశారు.. శ్రీమణి.

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా నటించిన చిత్రం ‘వెంకీమామ’. రాశీ ఖన్నా, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లు. కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా విడుదలైన ‘కోకా కోలా పెప్సీ’ పాట యూత్‌ని ఆకట్టుకుంటోంది.

కన్నే కన్నే సాంగ్‌లో ప్రేమకోసం ఎదురు చూసే ఓ అబ్బాయి పడే తపనను శ్రీమణి చక్కగా రాశారు. 'తన ప్రేయసినే చూస్తూ చూస్తూ … తననే మరిచాడంటా' ఆ ప్రేమికుడు. ఈ పాట అర్జున్ సురవరం చిత్రంలోనిది. సామ్ సీ.ఎస్ అందించిన మ్యూజిక్ పాటకి ఇంకా హైప్ క్రియేట్ చేసింది.

'ఎప్పుడు ప్యాంటు వేసుకునేటోడూ.. లుంగీ కట్టుకొచ్చి మాస్ స్టెప్పేస్తే.. ఉంటది నా సామిరంగా' ..ఇక మహేశ్ బాబు ఫ్యాన్స్‌కి పండగే అన్నట్లు ఉంది .. 'మైండ్‌బ్లాక్‌' సాంగ్.

ప్రేమ ఎక్కడా ఉన్నా .. ఇక్కడ రావమ్మా అంటోంది.. బిగ్‌బాస్3 ఫేమ్ పునర్నవి భూపాళం. తను ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సైకిల్ చిత్రంలోనిది ఈ పాట. శ్రీపాద చిన్మయి వాయిస్‌ కూడా తోడవగా.. ఈ సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్‌కి ఎంతగానో నచ్చింది.