ప్రస్తుతం ఇండియా, ఆస్ట్రేలియా మధ్య క్రికెట్ సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సిరీస్ హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కావడం లేదు. కానీ సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమ్ చేసేందుకు అవకాశం ఉంది.

మనం స్మార్ట్ ఫోన్‌లో అవసరానికి తగ్గట్లు యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటూ ఉంటాం. అయితే అలా యాప్స్ డౌన్‌లోడ్, ఇన్‌స్టాల్ చేసుకునేటప్పుడు పాటించాల్సిన టిప్స్‌ను కేంద్రప్రభుత్వ సంస్థ సెర్ట్-ఇన్ వెల్లడించింది. వాటిని తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి!

మనం చాలా విషయాల కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తూ ఉంటాం. అయితే గూగుల్ సెర్చ్‌లో ఉండే కొన్ని టిప్స్ తెలిస్తే వాటి గురించిన సమాచారాన్ని మరింత సులభంగా సంపాదించవచ్చు. క్రికెట్ స్కోర్లు, మీకు కావాల్సిన కాలేజీ సమాచారం, సినిమా థియేటర్ టైమింగ్స్, రెస్టారెంట్ల అడ్రెస్‌లు ఇలాంటివన్నీ ఈ టిప్స్ ద్వారా తెలుసుకోవడం చాలా ఈజీ.

వాట్సాప్ ఎక్కువగా ఉపయోగించేవారు, ముఖ్యంగా మహిళలు కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే మనం కొన్ని టిప్స్ పాటిస్తే వాట్సాప్‌లో కూడా సేఫ్‌గా ఉండవచ్చు. అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ ఎత్తకుండా ఉండటం, ఒకవేళ ఎత్తాల్సి వస్తే మీ సెల్ఫీ కెమెరాను వేలితో బ్లాక్ చేయడం, +91 కాకుండా ఇతర నంబర్ల నుంచి వచ్చే కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఉండటం, మీ ప్రొఫైల్ పిక్చర్, స్టేటస్ మెసేజ్ మీ కాంటాక్ట్స్‌లో ఉన్న వారు మాత్రమే చూసేలా సెట్ చేసుకోవడం, మీ కాంటాక్ట్స్‌లో ఉన్నప్పటికీ మీరు వాట్సాప్‌లో చాట్ చేయని వారిని బ్లాక్ చేయడం, గ్రూపుల్లో ఎవరు పడితే వారు యాడ్ చేయకుండా సెట్టింగ్స్ మార్చుకోవడం వంటివి చేయడం ద్వారా వాటిని ఎదుర్కోవచ్చు.

సాధారణంగా మనం గూగుల్ ఖాతాలో పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. అయితే మీ ఫోన్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక ఓటీపీ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీ గూగుల్ ఖాతా మరింత సేఫ్‌గా ఉంటుంది.

దారి తెలియని చాలా చోట్ల మనకు గూగుల్ మ్యాప్స్ ఒక వరంలా కనిపిస్తుంది. కొన్ని సార్లు దెబ్బేస్తుంది అనుకోండి.. కానీ అది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ మనలో చాలా మందికి గూగుల్ మ్యాప్స్‌ను ఎలా ఉపయోగించాలో పూర్తిస్థాయిలో తెలియదు. గూగుల్ మ్యాప్స్‌లో ఎక్కువ మందికి తెలియని ఆరు టిప్స్ ఇవే. వీటిని ఎలా ఉపయోగించాలో వీడియోలో స్క్రీన్ షాట్ రూపంలో పూర్తిగా వివరించారు. కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి. గూగుల్ మ్యాప్స్‌లో ఒక ప్రదేశాలన్ని మార్క్ చేయడం, డ్రైవ్ చేస్తూ వాయిస్ కమాండ్స్ ఉపయోగించడం వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

సాధారణంగా మనలో చాలా మంది వాట్సాప్‌ను ఉపయోగిస్తారు. అయితే కొంతకాలం పోయాక ఎటువంటి కొత్త మెసేజ్‌లూ రాకపోయినా వాట్సాప్‌‌ను పదేపదే చూడటం, దానికి ఎక్కువ అలవాటు అవ్వడం వంటివి చేస్తారు. అయితే ఈ టిప్స్ ఫాలో అయితే వాట్సాప్ మీ ఫోన్‌లో ఉన్నా ఉన్నట్లే ఉండదు. అన్ ఇన్ స్టాల్ చేయకుండా వాట్సాప్‌ను ఎక్కువ సేపు ఉపయోగించకుండా ఉండవచ్చు.

సాధారణంగా Whatsapp అందరూ ఉపయోగిస్తూనే ఉంటాం. ఇప్పుడు వాట్సాప్‌లో వేధింపులు కూడా ఎక్కువయ్యాయి. అయితే వీటికి గురించి కాకుండా ఉండాలంటే ఈ ఆరు టిప్స్ పాటించండి.

సాధారణంగా మనం కొత్త పాస్ వర్డ్ పెట్టేటప్పుడు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. మనం కామన్ గా చేసే 10 తప్పులు ఇవే. కాబట్టి కొత్త పాస్ వర్డ్ ఎంచుకునేటప్పుడు ఈ 10 తప్పులు అస్సలు చేయకండి.

ప్రస్తుతం కరోనావైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఆన్ లైన్ లోనే ఎక్కువ సమయం గడుపుతోంది. దీంతో హ్యాకర్లు కూడా విజృంభిస్తున్నారు. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో ఈ ఎనిమిది లక్షణాలు కనిపిస్తే ఫోన్ హ్యాక్ అయింది అనడానికి అవకాశం ఉంది. మీ స్మార్ట్ ఫోన్ లో యాడ్స్ ఎక్కువగా రావడం, మీరు ఇన్ స్టాల్ చేయకుండా యాప్స్ ఇన్ స్టాల్ అవ్వడం, ఇన్ స్టాల్ చేసిన యాప్స్ కు సంబంధించిన ఐకాన్స్ కనిపించకపోవడం, బ్యాటరీ ఒక్కసారిగా డ్రెయిన్ అవ్వడం, ఇంటర్నేషనల్ కాల్స్ ఎక్కువగా రావడం, మొబైల్ డేటా వేగంగా అయిపోవడం, యాప్స్ అప్ డేట్ అవ్వకపోవడం, ఫోన్ ఒక్కసారిగా స్లో అవ్వడం వంటివే ఈ లక్షణాలు.