ఈ బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారికి షాక్!

మీరు కెనరా బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే ఒక విషయం తెలుసుకోవాలి. బ్యాంక్ ఎఫ్‌డీ వడ్డీ రేట్లను సవరించింది. కొత్త వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకోండి.

ప్రధానాంశాలు:బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్వడ్డీ రేట్ల సవరణకొత్త రేట్లు ఇలాప్రభుత్వ రంగానికి చెందిన కెనరా బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై FD వడ్డీ రేట్ల తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఇకపై ఎఫ్‌డీలపై తక్కువ వడ్డీ లభిస్తుంది.

కెనరా బ్యాంక్ 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారు పదేళ్లలోపు నచ్చిన టెన్యూర్‌ను ఎంచుకోవచ్చు. ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మెచ్యూరిటీ తర్వాత డబ్బులు మళ్లీ వెనక్కి వస్తాయి.

Also Read: కేంద్రం గుడ్ న్యూస్.. ఈ కార్డుతో రూ.2 లక్షల బెనిఫిట్.. ఉచితంగానే పొందండిలా!

బ్యాంక్‌లో 7 రోజుల నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 2.9 శాతం వడ్డీ, 46 రోజుల నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై 3.9 శాతం, 91 రోజుల నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై 3.95 శాతం, 180 రోజుల నుంచి ఏడాది లోపు ఎఫ్‌డీలపై 4.4 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది ఎఫ్‌డీలపై 5.1 శాతం వడ్డీ పొందొచ్చు.

ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 5.1 శాతం, రెండేళ్ల నుంచి మూడేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.1 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ లభిస్తుంది. 111 డేస్ ఎఫ్‌డీలపై 5.35 శాతం, ఐదేళ్ల నుంచి పదేళ్లలోపు ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ పొందొచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం ఎక్కువ వడ్డీ వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Kabul ఎవ్వర్నీ వదలం.. వేటాడి పట్టుకుంటాం.. కాబూల్ పేలుళ్లపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

Fri Aug 27 , 2021
Taliban కాబూల్ అంతర్జాతీయ విమానం, దాని పరిసర ప్రాంతాల్లో ఆత్మహుతి దాడులు జరిగే ప్రమాదం ఉందని అమెరికా సహా పలు పశ్చిమ దేశాలు హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ముష్కరులు రెచ్చిపోయారు.