రూ.100 కోసం కక్కుర్తి.. రూ.లక్షన్నర స్వాహా.. యాప్ నిర్వాకం.. లబోదిబోమంటున్న రైతు కుటుంబం!

రూ.100 పెడితే రూ.200 గెలవచ్చంటూ లింక్ వచ్చింది. నిజమే అనుకుని క్లిక్ చేశాడా తొమ్మిదో తరగతి చదివే బాలుడు. అంతే బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.లక్షన్నర స్వాహా అయింది.

ప్రధానాంశాలు:మరో మోసపూరితమైన యాప్ వెలుగులోకి..ఆగని సైబర్ నేరగాళ్ల ఆగడాలుఆన్‌లైన్ క్లాసుల కోసం కొడుక్కి ఫోన్ కొనివ్వడమే ఆ తండ్రి చేసిన పాపం అయింది. క్లాసుల్లో పాఠాలు వినడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆ కొడుకు చేసిన పని రూ.లక్షన్నర స్వాహా చేసింది. దీంతో ఇప్పుడు ఆ రైతు కుటుంబం లబోదిబోమంటుంది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా భూక్యారామ్ తండాలో జరిగింది.

గ్రామానికి చెందిన వెంకన్నకు స్థానిక ఎస్‌బీఐ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల ధాన్యం విక్రయించిన నగదు, రైతుబంధు కింద వచ్చిన సొమ్ము, తను దాచుకున్న డబ్బు మొత్తం కలిసి రూ.లక్షన్నర వరకు ఆ ఖాతాలో జమ చేశాడు. అయితే విత్తనాలు కొనుగోలు చేసేందుకు నగదు డ్రా చేయడానికి బ్యాంకుకు వెళ్లిన వెంకన్నకు షాక్ తగిలింది. ఖాతాలో కేవలం రూ.613 మాత్రమే ఉన్నాయని బ్యాంకు సిబ్బంది తెలిపారు.

దీంతో వెంకన్న బ్యాంక్ స్టేట్ మెంట్ తెప్పించి చూశాడు. ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యలో ఏకంగా రూ.లక్షన్నర తన బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయినట్లు తెలుసుకున్నాడు. తర్వాత తేలిందేంటంటే.. వెంకన్న కొడుకు గణేష్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తనకు ఆన్‌లైన్ క్లాసుల నిమిత్తం స్మార్ట్ ఫోన్‌ను వెంకన్న కొనిచ్చాడు. తన బ్యాంకు ఖాతాను కూడా అందులో ఉన్న యాప్స్‌కు లింక్ చేశాడు.
శాంసంగ్ ఎం32 వచ్చేసింది.. రూ.15 వేలలోపే 6000 mah బ్యాటరీ.. అదిరిపోయే ఫీచర్లు కూడా!
అయితే గణేష్‌కు ఫోన్‌లో ఒక లింక్ వచ్చింది. రూ.100 పెడితే రూ.200 గెలవచ్చంటూ అందులో పేర్కొన్నారు. ఆశపడి గణేష్ ఆ లింక్‌పై క్లిక్ చేయగా.. వెంకన్న బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.లక్షన్నర మాయం అయ్యాయి. విషయం తెలుసుకున్న వెంకన్న వెంటనే బ్యాంకు ఖాతాను నిలిపివేసి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ యాప్ గురించి తనకు ఏమీ తెలీదని, కేవలం వచ్చిన లింక్‌పై మాత్రమే తాను క్లిక్ చేశానని గణేష్ అంటున్నాడు. లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే రూ.200 జమ అయినట్లు యాప్‌లో చూపించిందని, తర్వాత అది మెల్లగా పెరుగుతూ పోయిందని తెలిపాడు. బ్యాంకు ఖాతా నుంచి నగదు కట్ అయిందని మెసేజ్ కూడా రాలేదని గణేష్ పేర్కొన్నాడు. పేటీయం ఖాతా నుంచి నగదు వేరే ఖాతాకు జమ చేసినట్లు విచారణలో తెలిసింది.

వ్యవసాయం కోసం దాచుకున్న డబ్బులు ఇలా పోవడంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. సైబర్ నేరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, పోలీసులు ఎంత శ్రమిస్తున్నా.. నేరగాళ్లు కొత్త రూపంలో దాడులు చేస్తూనే ఉన్నారు. ఇటువంటి దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. కాబట్టి అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయడం వంటి అస్సలు చేయకండి. ఎందుకంటే మీ ఖాతాలో నగదు, మీ ఫోన్‌లో డేటాను మోసగాళ్లు కొట్టేసే అవకాశం ఉంది.
ఈ శాంసంగ్ సూపర్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.6 వేలు తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు కొనొచ్చంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టోక్యో ఒలింపిక్స్.. భారత పతాకధారిగా తెలుగు తేజం పీవీ సింధు!

Sat Jun 26 , 2021
ఒలింపిక్స్‌లో మెడల్ గెలవడమే కాదు.. ఆ క్రీడల్లో పాల్గొనడం కూడా ప్రతి క్రీడాకారుడి కల. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ క్రీడల్లో పాల్గొనే భారత బృందాన్ని అరుదైన అవకాశం తెలుగు తేజం సింధుకు దక్కినట్టు సమాచారం.