‘బాయ్స్‌’ కోసం కదలి వచ్చిన సన్నీ లియోనీ.. సెన్సేషనల్ సినిమా టీజర్ లాంచ్

టాలీవుడ్ ‘బాయ్స్’ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీ కదలి వచ్చింది. ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన ఆమె.. దయానంద్ తెరకెక్కిస్తున్న ‘బాయ్’ అనే సినిమాను లాంచ్ చేశారు. ఈ సినిమాలో గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోనీ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆమె గతాన్ని పక్కనపెడితే బాలీవుడ్‌లోకి వచ్చిన తర్వాత నటనపరంగా.. డ్యాన్స్ పరంగా ఆమె ప్రేక్షకులను ఎంతో అలరించారు. ‘రాగిణి ఎమ్మెమెస్-2’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఆమె ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు సాధించారు. అంతేకాక.. సామాజికసేవలల్లో కూడా చాలా హుషారుగా పాల్గొంటూ ఆమె తన మంచి తనాన్ని కూడా నిరూపించుకున్నారు.

తాజాగా టాలీవుడ్‌కి చెందిన ‘బాయ్స్’ కోసం సన్నీ లియోనీ కదలి వచ్చారు. అయితే అది నిజంగా అబ్బాయిల కోసం కాదండోయ్.. దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ అడల్డ్ రొమాంటిక్ స్టోరీగా దర్శకుడు దయానంద్ ఈ సినిమాని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్, ‘రాజా హే రాజా’ అనే పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా సన్నీ లియోనీ ఈ సినిమా టీజర్‌ని లాంచ్ చేయడం సినిమాకు మరింత హైప్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

ఇక ఈ సినిమాలో గీతానంద్‌తో పాటు.. రోవిత్, అన్షులా ధావన్, శ్రీహాన్ జెన్నిఫర్, షీటల్ తివారీ, సుజీత్, బమ్చిక్ బల్బూ, కౌషల్ మండా తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేసిన సన్నీ చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఇక ఈ టీజర్‌లో మూడు జంటల మధ్య జరిగే రొమాన్స్, కిస్సింగ్ సీన్లు ఇతర అడల్ట్ కంటెట్ ప్రధానంగా ఉన్నాయి. హీరోయిన్లు బికినీలు ధరించి ప్రేక్షకులకు కావాల్సినంత అందాల ఆరబోత అందించారు. మరి ఇంత అడల్ట్ కంటెంట్ ఉన్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ రేంజ్‌లో అలరిస్తుందో వేచి చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

స్మార్ట్‌టీవీల ధరలు భారీగా పెంపు.. ఏకంగా 15 శాతం పైగా పెంచిన ప్రముఖ బ్రాండ్!

Fri Jul 16 , 2021
వన్‌ప్లస్ మనదేశంలో స్మార్ట్‌టీవీల ధరను పెంచింది. ఏకంగా 17.5 శాతం వరకు ఈ టీవీల ధరను కంపెనీ పెంచింది. నగదు రూపంలో చెప్పాలంటే గరిష్టంగా రూ.7,000 వరకు టీవీల ధరను పెంచారు.