రూ.లక్ష పెడితే సంవత్సరానికే రూ.3 లక్షలు.. కళ్లుచెదిరే లాభం!

కళ్లుచెదిరే లాభం పొందాలంటే స్టాక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వాలి. ఎందుకంటారా? ఇక్కడ ఒక షేరు ధర ఏడాది కాలంలోనే భారీగా పెరిగింది. రూ.లక్షను రూ.3 లక్షలు చేసేసింది. అయితే మార్కెట్‌లో భారీ రిస్క్ కూడా ఉంటుంది.

ప్రధానాంశాలు:అదిరిపోయే రాబడిఏడాదిలోనే భారీ లాభంమరింత పెరిగే ఛాన్స్కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ట్రావెల్‌పై గత ఏడాది నుంచి ఆంక్షలు విధించింది. అయినా కూడా ఇక్కడ ఒక కంపెనీ స్టాక్ మాత్రం ఇన్వెస్టర్లకు లాభాల వర్షం కురిపించింది. భారీ రాబడిని అందించింది. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీసెస్ కంపెనీ షేరు అదిరిపోయే లాభాన్ని ఇచ్చింది.

ఈ షేరు ఇన్వెస్టర్ల డబ్బును మూడు రెట్లు చేసింది. పలు దేశాల్లో లాక్ డౌన్ ఉన్నా కూడా ఈ షేరు ధర గత ఏడాది కాలంలో 220 శాతం పరుగులు పెట్టింది. ఇది స్మాల్ క్యాప్ స్టాక్. ఏడాది కిందట ఈ షేరు ధర రూ.43గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ స్టాక్ ధర రూ.139 వద్ద కదలాడుతోంది.

అంటే మీరు ఏడాది కిందట ఈ షేరులో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ఇప్పుడు మీ డబ్బు విలువ రూ.3 లక్షలకు పైనే అయ్యి ఉండేది. బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ అనేది గ్లోబల్ వీసా ఔట్‌సోర్స్ సర్వీస్ ప్రొవైడర్. ఇది ప్రభుత్వాలతో, ఎంబసీలతో భాగస్వామ్యం కుదుర్చుకొని కస్టమర్లకు సర్వీసులు అందిస్తూ ఉంటుంది. 32 దేశాల్లో ఈ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

Also Read: రూ.55 కడితే రూ.36 వేలు.. మోదీ అదిరే స్కీమ్.. ఇలా చేరండి!

Also Read: గుడ్ న్యూస్.. ఈ స్కూటర్‌పై రూ.8 వేలకు పైగా తగ్గింపు.. రూ.3 వేలు ఉంటే ఇంటికి తీసుకెళ్లొచ్చు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Karthika Deepam: నేను మహేష్ బాబు ఫ్యాన్‌ని.. త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ: డాక్టర్ బాబు ఇంటర్వ్యూ

Sat Jun 19 , 2021
వెండితెరపై సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే.. బుల్లితెరపై సూపర్ స్టార్ ఈ డాక్టర్ బాబు. అయితే ఈ బాబుకి ఆ బాబు యాక్టింగ్ అంటే మహా ఇష్టం అట. మరి ఈ ఇద్దరూ బాబులిద్దరూ కలిసి నటించే అవకాశం వస్తుందో లేదో తెలియదు కానీ.. త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఉంటుందని చెప్తున్నారు డాక్టర్ బాబు.