కోర్టుకు వెళ్లడానికి అనారోగ్యం సాకులు.. పెళ్లిలో డ్యాన్సులా: బీజేపీ ఎంపీకి చురకలు

మాలేగావ్‌ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా ఠాకూర్‌.. కోర్టు విచారణకు హాజరుకావడానికి అనారోగ్య కారణాలను సాకుగా చూపుతుంటారని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ప్రధానాంశాలు:బాస్కెట్‌బాల్ ఆడి ఆశ్చర్య పరిచిన బీజేపీ ఎంపీ.పెళ్లిలో ఉత్సాహంగా స్టెప్పులు వేసిన సాధ్వీ.మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎంపీపై ఆరోపణలు.తరుచూ వివాదాలతో వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్.. ఇటీవల ఉత్సాహంగా బాస్కెట్‌బాల్ ఆడుతూ అనుభవం ఉన్న ఆటగాడి మాదిరిగా బాల్‌ను నెట్‌లో వేసిన వీడియో వైరల్ అయ్యింది. తాజాగా, ఓ పెళ్లికి హాజరైన ఎంపీ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తున్న మరో వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియోలపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందిస్తూ.. అనారోగ్య కారణాలతో హాజరుకాలేనని కోర్టుకు చెబుతున్న ఎంపీ.. ఇలా డ్యాన్స్‌లు చేయడం, బాస్కెట్‌బాల్ చాలా సంతోషంగా ఉందంటూ చురకలంటించారు.

మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆరోగ్యపరమైన సమస్యల కారణంగా ఎప్పుడూ వీల్‌ఛైర్‌లోనే కన్పించే ఆమె.. ఒక్కసారిగా బాస్కెట్‌బాల్ ఆడటం, డ్యాన్సులు చేయడంతో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. భోపాల్‌లోని ఓ నిరుపేద యువతుల వివాహ వేడుకలో పాల్గొన్న ప్రజ్ఞా ఠాకూర్.. పాదం కదుపుతూ అక్కడున్న వారిని డ్యాన్స్ చేయాలంటూ ఉత్సాహపరిచారు.

ప్రజ్ఞా ఠాకూర్ వచ్చి, ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పెళ్లికుమార్తెలు మీడియాతో చెప్పారు. రోజు కూలీ అయిన ఓ వధువు తండ్రి మాట్లాడుతూ.. ఎంపీ సహాయం చేసుండకపోతే కుమార్తెలకు పెళ్లిళ్లు జరిగేవి కావన్నారు. ‘ఇది నాకు రెండో జన్మ.. పేదరికంతో నా కుమార్తెలకు పెళ్లిళ్లు జరిపించలేని స్థితిలో ఉన్నాను.. కానీ, ప్రజ్ఞా ఠాకూర్ ఎంతో సాయం చేశారు.. ఆ దేవత ఆరోగ్యం ఉండాలని ప్రార్ధిస్తున్నాను..నేను చాలా సంతోషంగా.. కృతజ్ఞతతో ఉన్నాను’ అని పేర్కొన్నాడు.

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా ఈ వీడియోలను తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి కామెంట్ చేశారు. ‘భోపాల్ ఎంపీ, సోదరి ప్రజ్ఞా ఠాకూర్‌ను చూసినప్పుడల్లా బాస్కెట్‌బాల్ ఆడటం, ఎవరి సాయం లేకుండా నడవడం లేదా ఇలా సంతోషంగా నృత్యం చేయడం వంటివి మనకు ఆనందాన్ని ఇస్తాయి…?’ అంటూ పోస్ట్ చేశారు.

జులై 1న బాస్కెట్‌బాల్ అడటంపై ఈ విధంగానే ట్వీట్ చేశారు. ‘‘ఎంపీ సాధ్వీని ఇప్పటివరకు నేడు వీల్‌ఛెయిల్‌లోనే చూశారు. కానీ ఈ రోజు ఆమె ఎంతో ఉల్లాసంగా బాస్కెట్‌బాల్‌ ఆడుతూ కన్పించారు.. ఇది చాలా సంతోషంగా ఉంది.. గాయాల వల్ల ఆమె ఎవరి సాయం లేకుండా నడపలేకపోయేవారు.. ఆమె ఎల్లప్పుడూ ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుతున్నా’’ అని పేర్కొన్నారు.

ఇక, 2008 నాటి మాలెగావ్ పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ప్రజ్ఞా ఠాకూర్‌.. అరెస్టయి జైలుకెళ్లారు. తొమ్మిదేళ్ల పాటు జైల్లో ఉన్న ఆమె 2017లో బెయిల్‌పై బయటకు వచ్చారు. మహారాష్ట్రలోని మాలెగావ్‌లో ఓ మసీదు వద్ద మోటార్ సైకిల్ బాంబు పేలి ఆరుగురు చనిపోగా.. 100 మందికిపైగా గాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

టీ20 వరల్డ్‌కప్‌లో నెం.3లో సూర్యకుమార్ బెస్ట్: మంజ్రేకర్

Fri Jul 9 , 2021
టీ20, వన్డేల్లో సుదీర్ఘకాలంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ నెం.3 స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ.. టీ20 వరల్డ్‌కప్‌లో ఆ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ని ఆడించాలని...