ఆమెకి అహంకారం.. అందుకే మోదీతో అలా.! జాతీయ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై షాకింగ్ కామెంట్స్ చేశారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. రాష్ట్రంలో కరోనా కట్టడికి ఆమె ఏదీ సరిగ్గా చేయలేరని విమర్శించారు.

ప్రధానాంశాలు:మమతపై బీజేపీ చీఫ్ తీవ్ర వ్యాఖ్యలుఈర్ష్య, అహంకారమన్న జేపీ నడ్డాబీజేపీ గెలవబోతుందంటూ ధీమాపశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఫైట్ చివరి దశకు చేరుకుంది. ఎనిమిది విడతల పోలింగ్‌లో ఇప్పటికే ఆరు దశలు పూర్తయ్యాయి. మరో రెండు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎలాగైనా బెంగాల్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు కమలదళం పావులు కదుపుతోంది. అధికార టీఎంసీని ఇరుకున పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

మమతా బెనర్జీకి ఈర్ష్య, అహంకారమని నడ్డా సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా కట్టడి కోసం సీఎం మమతా బెనర్జీ ఏమీ చేయలేరని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రులతో మోదీ ఏర్పాటు చేసిన ఒక్క సమావేశానికి కూడా మమతా బెనర్జీ హాజరుకాలేదని ఆయన గుర్తుచేశారు. సమావేశానికి రాకుండా ఆమెను ఎవరు అడ్డుకున్నారు? ఆమె ఈర్ష్య, అహంకారం కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఆమె అరాచకమే బెంగాల్ అభివృద్ధిని కూడా అడ్డుకుంటోందని నడ్డా అన్నారు.

ఏడో దళ పోలింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జేపీ నడ్డా మానిక్‌చాక్‌లో మాట్లాడారు. టీఎంసీ నిరంకుశ పరిపాలనకు చరమగీతం పాడేందుకు బెంగాలీలు సిద్ధంగా ఉన్నారని.. గత ఆరు దశల పోలింగ్‌లో మమతా బెనర్జీకి అపజయం ఖాయం చేశారని నడ్డా అన్నారు. మిగిలిన రెండు దశల ఎన్నికల్లోనూ బెంగాల్ ప్రజలు కమలం గుర్తకే ఓటేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆ విషయంలో బెంగాలీలు ఎవరికీ భయపడరని నడ్డా వ్యాఖ్యానించారు.

Also Read: Covishield ఇండియాలోనే రేటెక్కువ.! బంగ్లాదేశ్‌లో ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

పెను విషాదం.. కోవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు పేలి 82 మంది మృతి

Sun Apr 25 , 2021
hagdad Covid hospital Fire కరోనా బారినపడి ప్రాణాల కోసం ఆస్పత్రికి వస్తే అవి మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. ఆస్పత్రుల నిర్లక్ష్యంతో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.