అఫ్ఘనిస్థాన్‌ క్రికెటర్‌తో పెళ్లి.. సంచలన నిర్ణయం తీసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ!! అదే కారణమంటూ ఓపెన్

అఫ్ఘ‌నిస్థాన్‌ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్‌బాస్ బ్యూటీ సంచలన నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.

అఫ్ఘ‌నిస్థాన్‌ మ‌ళ్లీ తాలిబ‌న్ల చేతుల్లోకి వెళ్లిపోవ‌డంతో ప్రపంచవ్యాప్తంగా ఈ దేశం గురించిన చర్చలే నడుస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితులపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు జనాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. దేశం తాలిబ‌న్ల గుప్పిట్లో పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురై ఆ దేశం విడిచి పారిపోయేందుకు విమానాశ్రయాల్లో ఎలాంటి సహాసాలు చేశారో చూసాం. అఫ్ఘనిస్థాన్‌లో జరుగుతోన్న ఈ పరిణామాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

అఫ్ఘన్‌లో జరగుతున్న పరిణామాలు చూశాక తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ బ్యూటీ అర్షీ ఖాన్. అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ ఒకరితో పెళ్లి నిశ్చయం అయిందని, అక్టోబర్‌లో నిశ్చితార్ధం జరగాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తన పేరెంట్స్ ఆ ఎంగేజ్మెంట్‌ క్యాన్సిల్ చేశారని అర్షీ ఖాన్ చెప్పింది. సదరు అఫ్ఘనిస్థాన్ క్రికెటర్ తండ్రి, తన తండ్రి మిత్రులని, ఆ కారణంతోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు కానీ అఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్స్ అరాచకాలు చూసి తన కుటుంబ సభ్యులు ఈ పెళ్లి పట్ల ఆందోళన చెందారని ఆమె తెలిపింది.
Ram Gopal Varma: బన్నీయే రియల్ మెగాస్టార్.. మళ్ళీ గెలికిన రామ్ గోపాల్ వర్మ.. మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య చిచ్చు!
అఫ్ఘ‌నిస్థాన్‌‌లో చోటు చేసుకుంటున్న నేటి దుర్భర పరిస్థితులు తమ పెళ్లిపై నీళ్లు చల్లాయని, సదరు క్రికెటర్‌తో సంబంధం క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పిన అర్షీ ఖాన్.. ఇక భారతీయుడినే పెళ్లి చేసుకోవాలని ఫిక్సయినట్లు తెలిపింది. బిగ్ బాస్ సీజన్‌ 11లో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత 14వ సీజన్‌లో ఛాలెంజర్‌గా షోలో తిరిగి ప్రవేశించింది. అలాగే 'సావిత్రి దేవి కాలేజ్ అండ్‌ హాస్పిటల్', 'విష్', 'ఇష్క్ మే మార్జవాన్' వంటి టీవీ షోలతో పాటు అనేక ఇతర రియాలిటీ షోలు, సినిమాలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

బచ్చన్ ఫ్యామిలీకి ఏమైంది..? ఆస్పత్రికి వచ్చిన అమితాబ్.. ఐశ్వర్య మాత్రం ఆలస్యంగా..

Tue Aug 24 , 2021
భారత సినిమా ఇండస్ట్రీలో టాప్ ఫ్యామిలీ ఎవరు అంటూ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ అనే చెప్పుకోవాలి. మరి అలాంటి ఫ్యామిలీలో ఓ విషాదం చోటు చేసుకుంటే అది ఫ్యాన్స్ అందరికీ బాధాకరంగానే ఉంటుంది. తాజాగా ఆ కుటుంబంలో అలాంటి సంఘటనే జరిగింది.