ఇరికించేందుకు కొందరి ప్రయత్నం.. భూమా అఖిల ప్రియ కీలక వ్యాఖ్యలు

ఫిర్యాదుదారులే కోర్టుకు రాకపోవడంతో విచారణ ఆలస్యమైందన్నారు అఖిల ప్రియ. కోర్టులు, పోలీసులు ఎప్పుడు పిలిచినా హాజరవుతున్నామని ఆమె తెలిపారు. అయినా కూడా తమను వేధిస్తున్నారని అఖిల ప్రియ మండిపడ్డారు.

ప్రధానాంశాలు:అఖిలప్రియ భర్తపై మరో కేసు కావాలనే ఇరికిస్తున్నారన్న అఖిల ప్రియ తమపై ఒత్తిడి తెచ్చుందుకు ప్రయత్నిస్తున్నారుటీడీపీ నేత మాజీ మంత్రి అఖిల ప్రియ భర్తతో పాటు సోదరుడిపై మరో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా అఖిల ప్రియ స్పందించారు. తమపై ఒత్తిడి తెచ్చేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. అంత‌కు మించి ఈ కేసులో వాస్తవాలు లేవని వ్యాఖ్యానించారు. కోర్టు, పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా తాము విచారణకు హాజరవుతున్నామని తెలిపారు. అయినా కూడా తమను ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని ఆమె ఆరోపించారు.

త‌మ‌ను ఎలాగైనా ఇరికించాలని కొంద‌రు ప్రయత్నిస్తున్నారన్నా అఖిల ప్రియ. విచారణకు రావాలని న్యాయ‌స్థానం గతంలో భార్గవ్ రామ్‌కు రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని, దీంతో కోర్టుకు హాజరయ్యామని తెలిపారు. ఫిర్యాదుదారులే కోర్టుకు రాకపోవడంతో విచారణ ఆలస్యమైందని వివ‌రించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తమపై తప్పుడు కేసులు పెట్టి వేధించడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు.

హైద‌రాబాద్‌లోని బోయినపల్లిలో క‌ల‌క‌లం రేపిన‌ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా భర్త భార్గవ్ రామ్ తో పాటు ఆమె సోదరుడు జగద్విఖ్యాత్ రెడ్డిపై కేసు నమోదు అయిన విషయ తెలిసిందే.. అయితే ఇదే విషయంలో మరో కేసు నమోదైంది. విచారణకు హాజరుకాకుండా భార్గవ్ రామ్, అఖిల ప్రియ సోదరుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డిపై నకిలీ కొవిడ్‌ సర్టిఫికెట్‌ సమర్పించినట్లు కేసు నమోదయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అది సెలెక్టర్ల నిర్ణయం..! ఒక్క మాటలో తేల్చేసిన సౌరవ్ గంగూలీ

Fri Jul 9 , 2021
టీమిండియా మేనేజ్‌మెంట్, భారత సెలెక్టర్ల మధ్య వివాదంపై ఇప్పుడు తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. పృథ్వీ షాని పంపమని మేనేజ్‌మెంట్ కోరగా.. అందుకు సెలెక్టర్లు ఒప్పుకోలేదు.