అభిమాని పిలిచాడని అలా.. బెల్లంకొండ శ్రీనివాస్ మంచి మనసు

మన తెలుగు నాట అభిమాని హీరో మధ్య ఉండే సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొంత మంది అభిమానులు తమ హీరోల కోసం ఏదైనా చేస్తుంటారు. ఇక మరి కొంత మంది హీరోలు తమ అభిమానుల కోసం ఎంతకైనా దిగి వస్తారు.

ప్రధానాంశాలు:అభిమాని పిలిచాడని అలాబెల్లంకొండ శ్రీనివాస్ మంచి మనసుసోషల్ మీడియాలో పిక్స్ వైరల్మన తెలుగు నాట అభిమాని హీరో మధ్య ఉండే సంబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కొంత మంది అభిమానులు తమ హీరోల కోసం ఏదైనా చేస్తుంటారు. ఇక మరి కొంత మంది హీరోలు తమ అభిమానుల కోసం ఎంతకైనా దిగి వస్తారు. అలా హీరోలు కొన్ని సందర్భాల్లో తమ అభిమానులపై చూపించే ప్రేమ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమాని కోసం ఇంటి నుంచి కదిలి వచ్చారు. హైద్రాబాద్ నుంచి కర్నూలు వరకు ప్రయాణించారు.

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తన అభిమాని కోసం చేసిన పని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన ఇంటి గృహ ప్రవేశ వేడుక ఉందని, రమ్మని ఆహ్వానించాడో అభిమాని. ఆ అభిమాని కోరిక తీర్చేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ తన ఫ్యామిలీతో సహా వెళ్లి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బెల్లంకొండ శ్రీనివాస్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Thalapathy 65 First Look : BEAST అంటూ దుమ్ములేపిన దళపతి
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ప్రస్తుతం మళ్లీ డైలామాలో పడింది. రాక్షసుడు వంటి హిట్ తరువాత అల్లుడు అదుర్స్ వంటి డిజాస్టర్ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ కెరీర్‌ను గాడిలో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఛత్రపతి రీమేక్ అంటూ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోన్నారు. ఇక కర్ణన్ రీమేక్‌లోనూ బెల్లంకొండ నటించబోతోన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే హిందీ ప్రేక్షకులకు డబ్బింగ్ చిత్రాలతో బెల్లంకొండ్ శ్రీనివాస్ సుపరిచితులన్న సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.100 కోసం కక్కుర్తి.. రూ.లక్షన్నర స్వాహా.. యాప్ నిర్వాకం.. లబోదిబోమంటున్న రైతు కుటుంబం!

Mon Jun 21 , 2021
రూ.100 పెడితే రూ.200 గెలవచ్చంటూ లింక్ వచ్చింది. నిజమే అనుకుని క్లిక్ చేశాడా తొమ్మిదో తరగతి చదివే బాలుడు. అంతే బ్యాంకు ఖాతా నుంచి ఏకంగా రూ.లక్షన్నర స్వాహా అయింది.