Avani Lekhara‌ అరుదైన ఘనత.. పారాలింపిక్స్‌లో షూటర్‌కి రెండో పతకం

పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని సరికొత్త చరిత్ర సృష్టించింది. నాలుగు రోజుల క్రితం గోల్డ్ మెడల్ గెలిచిన అవని.. ఈరోజు కాంస్య పతకంతో అరుదైన ఘనత సాధించింది.

ప్రధానాంశాలు:పారాలింపిక్స్‌లో అవనికి మరో పతకం10మీ ఎయిర్‌ రైఫిల్‌లో ఇప్పటికే గోల్డ్ఈరోజు 50మీ రైఫిల్‌లో కాంస్య పతకం12కి చేరిన భారత్ పతకాల సంఖ్య టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత షూటర్ అవని లేఖరా అరుదైన ఘనత సాధించింది. మహిళల 10మీ ఎయిర్ రైఫిల్ విభాగంలో గత సోమవారం గోల్డ్ మెడల్ గెలిచిన అవని లేఖరా.. శుక్రవారం జరిగిన 50మీ రైఫిల్‌లో కాంస్య పతకాన్ని గెలుపొందింది. దాంతో.. పారాలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి మహిళగా అవని నిలిచింది. లేఖరా ఫైనల్లో 445.9 పాయింట్లు సాధించింది. పారాలింపిక్స్‌‌లో అదీ షూటింగ్‌లో భారత్‌ పతకాలు గెలవడం ఇదే తొలిసారి.

కాంస్య పతకం గెలవడంపై అవని లేఖరా మాట్లాడుతూ ‘‘ఈరోజు ఫైనల్ చాలా కఠినంగా అనిపించింది. అయినప్పటికీ కాంస్య పతకం గెలపొందడం సంతోషంగా ఉంది. నేను ఇంకా మెరుగైన ప్రదర్శన కనబర్చాల్సింది. తొలిసారి పారాలింపిక్స్‌లో పోటీపడి రెండు పతకాలు గెలవడం మంచి అనుభవం. గత కొన్ని నెలలుగా ఈ పతకాల కోసం శ్రమించాను. ఇంకా మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. వాటిని దిద్దుకుని నెక్ట్స్‌ టైమ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తా’’ అని చెప్పుకొచ్చింది.

పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 12కి చేరింది. ఇందులో రెండు స్వర్ణ పతకాలు, ఆరు రజతాలు, నాలుగు కాంస్య పతకాలు ఉన్నాయి. ఆగస్టు 24న ప్రారంభమైన టోక్యో పారాలింపిక్స్.. సెప్టెంబర్ 5న ముగియనున్నాయి. ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఒక పసిడితో సహా ఏడు పతకాలు సాధించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

రూ.13 వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్.. రెడ్‌మీ 10 ప్రైమ్ వచ్చేసింది!

Fri Sep 3 , 2021
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెడ్‌మీ 10 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. గతంలో లాంచ్ అయిన రెడ్‌మీ 9 ప్రైమ్‌కు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.