ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మెన్‌కి కరోనా పాజిటివ్

ఆస్ట్రేలియా టీమ్‌కి 2019 జులై నుంచి పీటర్ హ్యాండ్స్‌కబ్ దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ గడ్డపై కంట్రీ క్లబ్‌లో ఆడుతున్న ఈ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్…

ప్రధానాంశాలు:ఆస్ట్రేలియా క్రికెటర్‌కి కరోనా పాజిటివ్ఇంగ్లాండ్ గడ్డపై మ్యాచ్‌లు ఆడుతున్న హ్యాండ్స్‌కబ్2019 నుంచి ఆస్ట్రేలియా టీమ్‌కి దూరంగా బ్యాట్స్‌మెన్ఇంగ్లాండ్ గడ్డపై మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులుఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్‌మెన్ పీటర్ హ్యాండ్స్‌కబ్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. 2019‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌కి దూరమైన హ్యాండ్స్‌కబ్.. అప్పటి నుంచి దేశవాళీ టోర్నీలకే పరిమితమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో కంట్రీ క్లబ్‌ మ్యాచ్‌లు ఆడుతున్న ఈ 30 ఏళ్ల బ్యాట్స్‌మెన్‌కి కరోనా సోకింది. అక్కడ మిడిల్‌సెక్స్ తరఫున మ్యాచ్‌లు ఆడుతున్న హ్యాండ్స్‌కబ్ ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లాడి కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకోలేకపోయాడు.

2019, జనవరిలో చివరిగా ఆస్ట్రేలియా టెస్టు టీమ్‌కి ఆడిన పీటర్ హ్యాండ్స్‌కబ్.. అదే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌పై బెంగళూరు వేదికగా చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. ఆ తర్వాత 2019, జులైలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతను ఆడిన చివరి మ్యాచ్. ఇంగ్లాండ్ గడ్డపై ఇటీవల శ్రీలంకతో సిరీస్ ఆడిన ఇంగ్లాండ్ టీమ్‌లో ఏకంగా ఏడు కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే. దాంతో.. ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

2016లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పీటర్ హ్యాండ్స్‌కబ్.. 16 టెస్టులు, 22 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో మూడు సెంచరీలు నమోదు చేసిన హ్యాండ్స్‌కబ్ ఐపీఎల్‌లోనూ రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ (ఇప్పుడు టోర్నీలో లేదు) తరఫున రెండు మ్యాచ్‌లు ఆడాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఉత్తరాదిలో పిడుగులు బీభత్సం.. 68 మంది మృతి

Mon Jul 12 , 2021
ఉత్తర భారతదేశంలో ఆదివారం కురిసిన అకాల వర్షాలకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో పిడుగులు చాలా మందిని పొట్టనబెట్టుకున్నాయి.