గనిలో పనిచేసే కార్మికులతో వెళ్తోన్న బస్సు బోల్తా.. 27 మంది మృతి

గనుల్లో పనిచేసే కార్మికులను తీసుకెళ్తోన్న ఓ బస్సు ప్రమాదానికి గురయి బోల్తాపడింది. అనంతరం లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రధానాంశాలు:రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు.250 మీటర్ల లోతైన లోయలోకి దూసుకెళ్లిన బస్సు.కార్మికులు గాఢనిద్రలో ఉండగా ప్రమాదంప్రయాణికులతో వెళ్తోన్న బస్సు లోయపడి 27 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటన పెరులో శుక్రవారం చోటుచేసుకుంది. గనుల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలను తీసుకెళ్తోన్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడింది. ప్రమాదంలో 27 మంది మృతిచెందగా.. మరో 13 మంది గాయపడ్డారు. స్థానిక మీడియా, పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. పెరూ దక్షిణ ప్రాంతం అయూకుచో వద్ద ఈ ప్రమాదం సంభవించింది. అయూకుచో- అరెక్విపా జాతీయ రహదారిపై స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అదుపుతప్పిన బస్సు 250 మీటర్ల లోతు లోయలోకి దూసుకెళ్లింది.

బస్సులో వారీ పాలోమినో మైనింగ్ కంపెనీకి చెందిన కార్మికులు, వారి కుటుంబసభ్యులే ఉన్నట్టు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను సమీపంలోని నాస్కా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలిలోనే పలువురు చనిపోగా.. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పెరూ రాజధాని లిమాకు 600 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇది ఎలా జరిగిందో ఇంకా తెలియారాలేదని, దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. పూర్తి సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. దక్షిణ పెరూ అరెక్విపాలో గనుల్లో పనులు కోసం కార్మికులను పాలోమినో మైనింగ్ కంపెనీ తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ‘‘ఈ ఘటన మాకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని, మేము ఇప్పటికే సమగ్ర దర్యాప్తును ప్రారంభించాం’’ అని ఆ సంస్థ సీఈఓ ఇగ్నాసియో బుస్టమ్నేట్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Mahesh Babu : మిల్కా సింగ్ మరణం.. సెలెబ్రిటీల సంతాపం.. మహేష్ బాబు అలా బాలయ్య ఇలా!

Sat Jun 19 , 2021
భారత దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ (92) ఇకలేరు. మే 20న కరోనా వైరస్ బారిన పడిన మిల్కాసింగ్.. మహమ్మారితో పోరాడి ఓడారు. రెండు రోజుల క్రితం కరోనా నెగటివ్ రావడంతో అతడ్ని ఐసీయూ నుంచి తరలించారు.