అసుస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ లాంచ్ పక్కా.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

అసుస్ తన జెన్‌ఫోన్ 8 సిరీస్‌ను ఇటీవలే గ్లోబల్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ మనదేశంలో అసుస్ 8జెడ్ పేరుతో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా టీజ్ చేసింది.

ప్రధానాంశాలు:అసుస్ 8జెడ్ వచ్చేస్తుందిలాంచ్ అయ్యేది ఎప్పుడంటే..అసుస్ జెన్‌ఫోన్ 8 సిరీస్ ఫోన్లను గతంలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అసుస్ జెన్‌ఫోన్ 8 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మనదేశంలో అసుస్ 8జెడ్ పేరుతో లాంచ్ కానుందని తెలుస్తోంది. అసుస్ ఇండియా బిజినెస్ హెడ్ దినేష్ శర్మ తన ట్వీటర్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. త్వరలో ఈ ఫోన్లకు సంబంధించిన లాంచ్ తేదీ కూడా తెలిసే అవకాశం ఉంది.

అసుస్ 8జెడ్‌కు సంబంధించిన మైక్రోసైట్ లింక్‌ను కూడా ఆయన ట్వీట్‌లో షేర్ చేశారు. దీని టీజర్ కూడా అసుస్ ఇండియా వెబ్‌సైట్లో చూడవచ్చు. దీన్ని బట్టి ఇవి మనదేశంలో త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అసుస్ 8జెడ్‌తో పాటు అసుస్ 8జెడ్ ఫ్లిప్ ఫోన్ కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఈ సిరీస్ మనదేశంలో మే నెలలోనే లాంచ్ కావాల్సింది. అయితే కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా అసుస్ దీని లాంచ్‌ను వాయిదా వేసింది.
మూడు బడ్జెట్ ఫోన్ల రేట్లు పెంచిన శాంసంగ్.. వేటి ధరలు ఎంత పెరిగాయంటే?
అసుస్ 8జెడ్ స్పెసిఫికేషన్లు
ఇందులో 5.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ ఈ4 అమోఎల్ఈడీ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కంపెనీ ఇందులో అందించింది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌పైఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. 4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు, క్విక్‌చార్జ్ 4.0 ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 30W ఫాస్ట్ చార్జర్‌ను దీంతోపాటు అందించనున్నారు.

అసుస్ 8జెడ్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్686 సెన్సార్‌ను అందించగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్663 కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 11 ఆధారిత జెన్‌యూఐ 8 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 5జీ, 4జీ, వైఫై 6, జీపీఎస్/ఏ-జీపీఎస్, నావిక్, ఎన్ఎఫ్‌సీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని మందం 0.89 సెంటీమీటర్లుగానూ, బరువు 169 గ్రాములుగానూ ఉంది.
మోటొరోలా కొత్త 5జీ ఫోన్ వచ్చేసింది.. రూ.20 వేలలోపే సూపర్ ఫీచర్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఇది కదా అసలైన స్మార్ట్ ఫోన్ అంటే.. సూపర్ మొబైల్ లాంచ్ చేసిన క్వాల్‌కాం!

Fri Jul 9 , 2021
టెక్ దిగ్గజం క్వాల్‌కాం తన కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. స్మార్ట్ ఫోన్ ఫర్ ఇన్‌సైడర్స్ అనే ప్రోగ్రాం కింద ఈ మొబైల్ లాంచ్ అయింది. ఇందులో టాప్ క్లాస్ ఫీచర్లను కంపెనీ అందించింది.