‘కావ్య’ కోసం ఇద్దరు కాదు.. రెండు కాలేజీలే కొట్టుకుంటున్నాయి.. ‘రౌడీబాయ్స్’ అంటూ!

కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. మరికొన్ని బోల్తా పడ్డాయి. అలా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమానే ‘రౌడీ బాయ్స్’. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది.

ఎవరైనా.. ఏ కాలేజీ అయినా.. కాలేజీ సమయంలో చేసిన ఎంజాయ్‌మెంట్ ఎప్పుడు చేయలేదు అని అంతా అనుకుంటారు. ఇంటర్ కాలేజీ నుంచి డిగ్రీలోకి ప్రవేశించడం.. అక్కడ కొత్త స్నేహితులు పరిచయం కావడం.. వారితో కలిసి చేసే అల్లరి.. సరదాలు, కాలేజీ పూర్తి చేసుకొని బయటకు వచ్చే సమయంలో ఎంతో బాధకి గురి కావడం చాలా మంది అనుభవించే ఉంటారు. ఎప్పుడు కాలేజీలో మనతో పాటు చదువుకున్న మిత్రులు కనిపించినా.. వాళ్లుతో కలిసి అప్పటి జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ.. సంతోషంగా గడుపుతారు. అలాంటి కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి.

అందులో కొన్ని బ్లాక్‌బస్టర్ హిట్లుగా, ట్రెండ్‌సెట్టర్లుగా నిలవగా.. కొన్ని బోల్తాపడ్డాయి. అయితే రీసెంట్‌గా కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా ‘రౌడీ బాయ్స్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు, శిరీష్ కుమారుడు అశీష్ హీరోగా.. ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేస్తుండగా.. హర్ష కొనుగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్‌లు, టైటిల్ టీజర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.

‘కాలేజ్ ఈ ఏ వండర్‌ఫుల్ ప్లేస్’ అనే డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభం అవుతోంది. ఆ తర్వాత కాలేజీలో విద్యార్థులు చేసే సందడి అంతా టీజర్‌లో చూపించారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్.. ఇక హీరోయిన్ కావ్య (అనుపమ) కోసం మరో కాలేజీ విద్యార్థులతో హీరో గొడవ పడటం.. ఆ తర్వాత అది రెండు కాలేజీల మధ్య గొడవగా మారటం మనకు టీజర్‌లో కనిపిస్తోంది. ఇక చివర్లో హీరో.. తన మిత్రులతో కలిసి.. తాము ‘రౌడీ బాయ్స్’ అనే డైలాగ్ చెప్పడంతో టీజర్ ముగుస్తోంది. మొత్తంగా చెప్పుకుండా ఈ టీజర్ ఆకర్షణీయంగా ఉంది. ఇక శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *