రూ.37.8 కోట్లకు అమ్ముడయిన 1938 నాటి భారతీయ చిత్రకారిణి కళాఖండం

విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఓ భారతీయ చిత్రకారిణి గీసిన అద్బుత చిత్రం… ఏకంగా కోట్ల పలికింది. ఎనిమిది దశాబ్దాల కిందట వేసిన ఈ పెయింటింగ్ వేలంలో దాదాపు 38 కోట్లకు అమ్ముడయ్యింది.

ప్రధానాంశాలు:భారతీయ కళాకారుల పెయింటింగ్స్ వేలం.గయ్‌టొండే చిత్రానికి దాదాపు రూ.40 కోట్లు.మహిళల జీవనంపై అమృత పెయింటింగ్.భారతీయ చిత్రకారిణి అమృతా షేర్‌ గిల్‌ 1938లో గీసిన ఓ పెయింటింగ్‌కు వేలంలో రికార్డుస్థాయి ధర పలికింది. దివంగత అమృతా షేర్‌ గిల్‌ గీసిన పెయింటింగ్ రూ.37.8 కోట్లకు అమ్ముడయ్యింది. భారతీయ చిత్రకారుల పెయింటింగ్‌కు ప్రపంచ వేలంలో అత్యధిక ధర పలికిన రెండో చిత్రం ఇదే. అంతేకాదు, అమృత కుంచె నుంచి జాలువారిన చిత్రాల్లో అత్యధిక ధర పలికిన పెయింటింగ్ కూడా ఇదే కావడం మరో విశేషం. వీఎస్‌ గయ్‌టొండె అనే కళాకారుడు గీసిన మరో పెయింటింగ్ ఈ ఏడాది వేలంలో రూ.39.98 కోట్లకు అమ్ముడుపోయింది.

దీనిని గయ్‌టొండె 1961లో వేయగా… భారతీయ కళాకారులు గీసిన చిత్రల్లో అత్యధిక ధరకు అమ్ముడైన పెయింటింగ్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ రెండు వేలాలను శాఫ్రాన్‌ఆర్ట్‌ సంస్థ నిర్వహించింది. విదేశాల నుంచి తిరిగొచ్చిన కొన్నేళ్ల తర్వాత గోరఖ్‌పుర్‌లోని తన కుటుంబ ఎస్టేట్‌లో అమృత షేర్ గిల్ ఆ పెయింటింగ్‌ను గీశారు. ‘ఇన్‌ ది లేడీస్‌ ఎన్‌క్లోజర్‌’ పేరుతో గీసిన ఆ కళాఖండంలో కొందరు మహిళలు దైనందిన పనుల్లో నిమగ్నమై కనిపిస్తున్నారు.

‘అమృత షేర్ గిల్ వేసిన పెయింటింగ్ రికార్డు ధరకు అమ్ముడుకావడం.. ఆమె కళాత్మక నైపుణ్యానికి, ప్రతిభకు నిదర్శనం..’ అని శాఫ్రాన్ఆర్ట్ సీఈఓ, సహ-వ్యవస్థాపకుడు దినేశ్ వజిరానీ వ్యాఖ్యానించారు. ఈ కళాఖండం ఒక కళాకారిణిగా ఆమె ఎదుగుదల, అభివృద్ధిని తెలియజేస్తుంది.. ఇన్నాళ్లకు చిత్రకారిణిగా ఆమెకు మరింత గుర్తింపు లభించిందని అన్నారు. ఆమె గీసిన ఈ చిత్రం చిత్రలేఖనంలో అరుదైన భాగం అని ఆయన పేర్కొన్నారు.

తాజా వేలంలో మొత్తం 54.25 కోట్ల విలువైన కళాఖండాలు అమ్ముడుపోయాయి. వీటిలో ఎఫ్‌ఎన్‌ సౌజా 1956లో గీసిన చిత్రం రూ.5.04 కోట్లకు, ఎన్‌ఎస్‌ బెంద్రే 1985లో సృజించిన చిత్రం రూ.1.67 కోట్లకు దక్కించుకున్నారు. వేలంలో బెంద్రే విక్రయించిన రెండో అత్యంత ఖరీదైన చిత్రం. ఈ ఏడాది మార్చిలో స్ప్రింగ్ లైవ్ వేలంలో ఆయన వేసిన పెయింటింగ్ అత్యధికంగా రూ.1.98 కోట్లకు అమ్మారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఒకేసారి గ్రూప్-1 ఉద్యోగాలు సాధించిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు!

Thu Jul 15 , 2021
ఓ కుటుంబంలో ఒక వ్యక్తి ఉన్నత ఉద్యోగం సంపాదిస్తే ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. అలాంటింది ఒకే కుటుంబంలో ఐదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నత ఉద్యోగాలు సాధించగా.. వీరిలో ముగ్గురు ఒకేసారి ఎంపికయ్యారు.