కోపా అమెరికా కప్ విజేతగా అర్జెంటినా.. మెస్సీ సారథ్యంలో తొలి మెగా టోర్నీలో గెలుపు

అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా గుర్తింపు పొందినా.. అతడు జట్టులోకి వచ్చిన తర్వాత ఒక్క మేజర్ టోర్నీని కూడా అర్జెంటీనా గెలుపొందలేదు. ఎట్టకేలకు ఆ కొరత తీరిపోయింది.

ప్రధానాంశాలు:28 ఏళ్ల తర్వాత కోపా టోర్నీ విజేతగా అర్జెంటీనా.జట్టులో చేరిన 16 ఏళ్ల తర్వాత మెస్సీకి పెద్ద గెలుపు.బ్రెజిల్‌కు సొంతగడ్డపై ఏడేళ్ల తర్వాత ఓటమి.కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీని అర్జెంటీనా గెలుపొందింది. ఫైనల్‌లో బ్రెజిల్‌ జట్టుపై 1-0 తేడాతో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా విజయం సాధించింది. దీంతో 15వ సారి ఈ టోర్నీని నెగ్గిన అర్జెంటీనా.. అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన నిలిచింది. మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా తొలిసారి అతిపెద్ద టోర్నీని గెలుపొందడం విశేషం. అంతేకాదు, 1993 తర్వాత కోపా అమెరికా టోర్నీని బ్రెజిల్ గెలవడం ఇదే తొలిసారి. ఈ టోర్నీ ఫైనల్‌లో అర్జెంటీనా, బ్రెజిల్ జట్లు మూడుసార్లు తలపడ్డాయి.

చివరిసారిగా 1993లో కోపా అమెరికా టోర్నీని అర్జెంటీనా గెలించింది. నాటి ఫైనల్‌లో గాబ్రియేల్ బటిస్టౌటా సారథ్యంలోని అర్జెంటీనా జట్టు.. మెక్సికోపై 2-1 తేడాతో గెలిచి టోర్నీని సొంతం చేసుకుంది. కాగా, కోపా అమెరికా టోర్నీ తాజా గెలుపుతో ఓ మేజర్ టోర్నీలో గెలవాలన్న అర్జెంటీనా 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. అంతేకాదు, 2,500 రోజుల తర్వాత సొంతగడ్డపైనే బ్రెజిల్‌ను ఓడించడం మరో రికార్డు. అర్జెంటీనా తరఫున ఏంజెల్ డి మారియా గోల్ చేశాడు. రియో డి జెనెరీలోని మారకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.

ఆరుసార్లు సొంతగడ్డపై కోపా అమెరికా టోర్నీ ఆడిన బ్రెజిల్ తొలిసారి ఓటమి చవిచూసింది. 34 ఏళ్ల మెస్సీ మాదిరిగానే బ్రెజిల్‌ ఆటగాడు నేమార్ అంతర్జాతీయ స్థాయిలో పెద్ద టైటిల్‌ను గెలవలేదు. రెండేళ్ల కిందట సొంత గడ్డపై సెలెకావో టోర్నీలో బ్రెజిల్ విజయం సాధించినా.. గాయం కారణంగా పాల్గొనలేదు. తుది పోరులో అర్జెంటీనా 22వ నిమిషంలో గోల్ చేసింది.

బ్రెజిల్ గోల్ కీపర్‌ ఎండర్సన్‌ను బోల్తా కొట్టించి ఏంజెల్ డి మారియా బంతిని నేరుగా పోస్ట్‌లోకి తరలించాడు. ఆట ముగియడానికి రెండు నిమిషాల ముందు మెస్సీ‌ గోల్‌కు ప్రయత్నించినా.. ఎండర్సన్‌ అడ్డుకోవడంతో బంతి పక్కకు వెళ్లింది. దీంతో గోల్ ప్రయత్నం విఫలమయ్యింది. ఇదిలా ఉండగా, అర్జెంటీనా జట్టులో చేరిన 16 ఏళ్ల తర్వాత మెస్సీ ఓ మెగా టోర్నీ గెలవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

విజయ్ దేవరకొండ హీరోయిన్ ఇంట తీవ్ర విషాదం.. ఆమెను తలచుకుంటూ అనన్య ఎమోషనల్ పోస్ట్

Sun Jul 11 , 2021
హీరోయిన్ అనన్య పాండే ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె నానమ్మ, చుంకీ పాండే తల్లి నిన్న (శనివారం) ముంబైలో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆమె తుది శ్వాస విడిచారు.