ఏపీఎస్ ఆర్టీసీ కొత్త సర్వీస్.. ఇకపై నేరుగా ఇంటికే, వివరాలివే

కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది.

ప్రధానాంశాలు:సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం అమలుడెలివరీ కావాలంటే అదనంగా ఛార్జీలుత్వరలోనే పూర్తి స్థాయిలో కార్గో సేవలుఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పార్సిళ్లను ఇంటికే డెలివరీ చేయనుంది. సెప్టెంబరు 1 నుంచి ఈ విధానాన్ని 13 జిల్లా కేంద్రాలు, విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలో అమలుచేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌కే పార్పిళ్లు బుక్‌ చేస్తున్నారు. వీటిని ఇళ్ల దగ్గరకు అందించేలా పోస్టల్‌శాఖతో చర్చిస్తున్నా అవి కొలిక్కి రాలేదు.

అందుకే అధికారులు బస్టాండ్లలో పార్శిళ్లు బుక్‌చేసే కాంట్రాక్టర్ ద్వారా ప్రయోగాత్మకంగా డెలివరీ సదుపాయం ప్రారంభిస్తున్నారు. పార్సిల్‌ బుక్‌ చేసుకునేవారు డెలివరీ కావాలంటే అదనంగా ఛార్జీ చెల్లించాలి. కేజీ బరువు వరకు జీఎస్టీతోపాటు రూ.15, 1-6 కేజీలకు రూ.25, 6-10 కేజీలకు రూ.30 చొప్పున అదనంగా చెల్లించాలి.

కార్గో రవాణా డోర్‌ డెలివరీ సేవలు మెరుగ్గా అందించేందుకు ఆర్టీసీ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. ఆర్టీసీ బస్‌ స్టేషన్లలోని స్టోరేజీ పాయింట్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఇక పార్సిళ్లకు ట్రాకింగ్‌ సదుపాయం ఏర్పాటు చేయనుంది. బుక్‌ చేసిన పార్సిల్‌ ఎక్కడ ఉందన్నది కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

అలాగే బీమా సదుపాయం కల్పిస్తోంది.. పొరపాటున పార్సిల్‌ కనిపించకుండా పోతే ఖాతాదారులకు ఈ మేరకు పరిహారం లభిస్తుంది. నగరాలు, పట్టణాలతోపాటు మారుమూల పల్లెలకు కూడా ఏజంట్ల ద్వారా డోర్‌ డెలివరీ సేవలు అందించే ప్రయత్నాల్లో ఉంది. లాజిస్టిక్‌ సేవల ద్వారా ఆదాయాన్ని పెంపొందించుకునే దిశగా ఆర్టీసీ కార్యాచరణకు సిద్ధమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

వ్యాక్సినేషన్‌లో భారత్ మరో రికార్డు.. నిన్న ఒక్క రోజే కోటికిపైగా డోస్‌లు పంపిణీ

Sat Aug 28 , 2021
కరోనా టీకా పంపిణీ కార్యక్రమంలో భారతదేశం సరికొత్త రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్​ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా ఒక్క రోజులోనే కోటికిపైగా డోస్‌లను పంపిణీ చేసింది.