ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ తేదీ లీక్.. వచ్చే నెలలోనే!

టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 13 సిరీస్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 14వ తేదీన ఈ ఫోన్లు ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రధానాంశాలు:సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ అయ్యే అవకాశంసేల్ తేదీ కూడా లీక్ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లు వచ్చే నెలలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన వివరాలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. సెప్టెంబర్ 14వ తేదీన యాపిల్ కొత్త ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయని లీకులు వస్తున్నాయి. ఈ సిరీస్‌లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ ఫోన్లు ఉండనున్నాయి.

ఈ నాలుగు ఫోన్లకు సంబంధించిన ప్రీ-ఆర్డర్లు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. అంటే సేల్ సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన మీడియా ఇన్వైట్లు సెప్టెంబర్ 7వ తేదీ నుంచి వచ్చే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్.. వచ్చే వారమే ప్రీ-బుకింగ్స్!
కరోనావైరస్‌కు ముందు యాపిల్ తన ఉత్పత్తులను సెప్టెంబర్‌లో కచ్చితంగా లాంచ్ చేసేది. సెప్టెంబర్ నెల మొదటి లేదా రెండో మంగళవారంలో ఈ కార్యక్రమం జరిగేది. గతేడాది లాక్‌డౌన్‌ల కారణంగా దీని సేల్ కాస్త ఆలస్యంగా జరిగింది. ఇప్పుడు మళ్లీ పాండమిక్ ముందు టైమింగ్‌లను యాపిల్ ఫాలో అయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేశారు. ఇందులో కొత్తగా సన్‌సెట్ గోల్డ్ అనే కొత్త కలర్ వేరియంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెనకవైపు రెండు కెమెరాలు, ముందువైపు వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఉండే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 30వ తేదీన ఎయిర్ పోడ్స్ 3 కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వీటిలో ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా అందించారు. ఐఫోన్ 13 కోసం శాంసంగ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేలు రూపొందించడం ప్రారంభించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఐఫోన్ 13 సిరీస్‌తో పాటు, భవిష్యత్తులో లాంచ్ అయ్యే ఐప్యాడ్ మోడల్స్ కోసం ఈ డిస్‌ప్లేను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎల్టీపీవో టెక్నాలజీతో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్‌ప్లేలను శాంసంగ్ రూపొందిస్తుంది. ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 ప్రోల్లో ఈ ఫోన్ డిస్‌ప్లే అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐఫోన్లలో 120 హెర్ట్జ్ డిస్ ప్లే ఉన్న ఫోన్లు ఇవే కానున్నాయి.
రెడ్‌మీ నోట్ 10 ధర ఏకంగా ఐదుసార్లు పెంపు.. ఇప్పుడు ఎంతంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

IND vs ENG 3rd Testలో సరికొత్త రికార్డులు.. కోహ్లీ కెప్టెన్సీలో అవమానకర ఓటమి

Sat Aug 28 , 2021
లీడ్స్ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఈరోజు భారత్ జట్టు ఓడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచినా టెస్టు మ్యాచ్‌లో భారత్ ఓడిపోవడం ఇది రెండోసారికాగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్.. అరుదైన ఘనత సాధించాడు.