మంత్రులను రాజీనామా చేయాలనడంతో అలా.. అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

అధికార పక్షం సృష్టించిన అరాచకానికి,అడ్డంకుల మూలంగా ప్రతిపక్షం అనేక చోట్ల నామినేషన్స్ కూడా వేయలేక పోయిందననారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమకేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారన్నారు.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాష్ర్టంలో అడుగడుగునా చట్టాల ఉల్లంఘన, రాజ్యాంగ దిక్కరణ జరుగుతోందన్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. పంచాయితీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందో దేశం మొత్తం చూసిందన్నారు. స్ధానిక ఎన్నికల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు టీడీపీ అభ్యర్ధులపై దాడులు, దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు కూడా వేయనీకుండా అడ్డుకుని పోలీసులు సాయంతో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని ఆరోపించారు.

అధికారులు,పోలీసులు బరితెగించి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించి ప్రజాస్వామ్యాన్నికాల రాశారన్నారు. ఎన్నికల్లో వైసీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటం వల్లే టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించిందన్నారు. ఈ ఎన్నికలు ప్రజాభిప్రాయం కాదు.. ప్రజాభిప్రాయం అని భావిస్తే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే దమ్ము ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ఉందా అని సవాల్ చేశారు.
అడ్డదారుల్లో,అక్రమాల ద్వారా ప్రజాస్వామ్య కల్పవృక్షాన్నే కబళించే స్థాయిలో వైసీపీ నేతలు వ్యవహరించారన్నారు.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడితే మంత్రులు నేరుగా రాజభవన్‌కి వెళ్ళాల్సిందేనని.. రాజకీయ భవిష్యత్ కోల్పోవాల్సి వస్తుందని జగన్ హెచ్చరించడంతో మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల మీద పడి దండయాత్ర చేశారన్నారు. అధికార పక్షం సృష్టించిన అరాచకానికి,అడ్డంకుల మూలంగా ప్రతిపక్షం అనేక చోట్ల నామినేషన్స్ కూడా వేయలేక పోయిందననారు. మెజారిటీ స్థానాల్లో ఏకగ్రీవం చేసుకొనేందుకు అక్రమకేసులు బనాయిస్తూ భయబ్రాంతులకు గురిచేశారన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా కనీ,విని ఎరుగని స్థాయిలో ఏకగ్రీవాలు చేసుకొన్నారన్నారు.

ప్రజల్ని ఏం ఉద్దరించారని ప్రజలు ఏకగ్రీవంగా పట్టం కడతారని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. పుంగనూరులో 69 ఎంపీటీసీల్లో 65, తంబళపల్లిల్లో 72 కి 72 శ్రీకాళహస్తిలో 64 కి 63 ఎంపీటీసీలు వైసీపీ బలవంతంగా ఏకగ్రీవం చేసుకుందన్నారు. రాష్ర్టంలో మొత్తం ఈ విధంగా అరాచకం, దాడులు, దౌర్జన్యాలతో ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు తాము చేసింది ఏమిటో చెప్పుకొని ఓట్లు అడుగుతారన్నారు. కానీ వైసీపీ నేతలు బెదిరింపులతో ఓటు వెయ్యకపోతే ఊళ్లో ఉండరని, సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని.. ఇళ్లు కూల్చేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని అరాచకం సృష్టించి ఎన్నికల్లో గెలిచి ప్రజాస్వామ్య విలువలకు శిలువ వేసారన్నారు. వీటిని ఎన్నికలు అనరు. అది సెలక్షన్ తప్పఎలక్షన్ కాదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

అప్పుడు సీఎం డొనాల్డ్ ట్రంప్.. ఏపీ హోంమంత్రి సుచరితపై ట్రోలింగ్స్

Sun Sep 19 , 2021
హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. మా హోమ్ మినిష్టర్ గారు నడిచే లైబ్రెరీ, విజ్ఞాన ఖని’అంటూ వంగలపూడి అనిత సెటైర్లు