అప్పుడు సీఎం డొనాల్డ్ ట్రంప్.. ఏపీ హోంమంత్రి సుచరితపై ట్రోలింగ్స్

హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. మా హోమ్ మినిష్టర్ గారు నడిచే లైబ్రెరీ, విజ్ఞాన ఖని’అంటూ వంగలపూడి అనిత సెటైర్లు

ప్రధానాంశాలు:సుచరిత వ్యాఖ్యలపై ట్రోల్స్వంగలపూడి అనిత సెటైర్లుఆ మాత్రం తెలియదా అంటూఏపీ హోంమంత్రి సుచరిత అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై మండిపడ్డారు. మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళను ‘బట్టలిప్పి కొడతా’ అని దూషించిన అయ్యన్నపాత్రుడు వంటి సంస్కారహీనుడి నుంచి ఇంతకంటే గొప్ప మాటలు వస్తాయని ఆశించలేమన్నారు. ఇతని వ్యాఖ్యలపై స్పందించడమంటే అశుద్ధంపై రాయి వేయడమేనన్నారు. ఎవరు ఏం చేస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారని.. ఇప్పటికైనా టీడీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలన్నారు. వంగవీటి రంగా హత్య టీడీపీ హయాంలో జరిగిందని.. ఆ తర్వాత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎమ్మెల్యేను, మరో మాజీ ఎమ్మెల్యేను హత్య చేశారని గుర్తు చేశారు.

హోంమంత్రి సుచరిత టీడీపీ హయాంలో వంగవీటి రంగా హత్య జరిగిందని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. రంగా హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేరన్నారు. ఏపీ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత సుచరితపై సెటైర్లు పేల్చారు. ‘అప్పుడు సీఎంగా ఉన్నది డోనాల్డ్ ట్రంప్ అండి హోమ్ మినిష్టర్ గారు. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చినపుడు వైఎస్సార్ సీఎంగా ఉన్నారు, చందమామ మీదకు తొలి మనిషి వెళ్ళినప్పుడు జగన్ సీఎం.. చెప్పమ్మా చెప్పు. మా హోమ్ మినిష్టర్ గారు నడిచే లైబ్రెరీ, విజ్ఞాన ఖని’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉండి అసత్యాలు ప్రచారం.. వంగవీటి రంగా గారు 1988 లో మరణించారు. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో లేరు.. ఈ విధంగా చంద్రబాబు గారిపై అసత్యాలు ప్రచారం మానుకోండి.. సబ్జెక్ట్ తెలియకపోతే తెలుసుకోండి అంటూ టీడీపీ కార్యకర్తలు కూడా ట్రోల్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

దుమారం రేపుతోన్న డ్రగ్స్ యవ్వారం.. నన్నెందుకు లాగారో.. మాజీ ఎంపీ షాక్! అయినా ఓకే

Sun Sep 19 , 2021
టాలీవుడ్ డ్రగ్స్ కేసు రాజకీయ రంగు పులుముకుంది. మంత్రి కేటీఆర్‌కి సంబంధముందని కాంగ్రెస్ చీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. రక్తం, వెంట్రుకలు ఇస్తానని కేటీఆర్ చేసిన సవాల్‌కి రేవంత్ వైట్ చాలెంజ్ విసిరారు.