ఏపీలో CT Scan ధరలపై జగన్ సర్కారు సంచలన నిర్ణయం.. మంత్రి నాని కీలక ఆదేశాలు

రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న తరుణంలో జగన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అల్లకల్లోలం రేపుతున్న తరుణంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో మెడికల్ పరీక్షల ధరలను నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సీటీ స్కాన్‌ ధర రూ. 3 వేలకు మించడానికి వీల్లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తేల్చి చెప్పారు. అధిక ఫీజులు తీసుకునే స్కానింగ్‌ సెంటర్లపై నిఘా పెట్టామని వెల్లడించారు.

అంతేకాకుండా ఫిర్యాదులు వచ్చే ప్రైవేటు ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. ప్రైవేటు ఆస్పత్రులపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం హెచ్చరించినా.. తప్పులు చేసే ఆస్పత్రుల గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి నిత్యం సేవలు అందించాలని కోరారు.

ఇక, కరోనా వైరస్ చికిత్స పూర్తయినా కూడా రోగులను డిశ్చార్జ్‌ చేయని కొన్ని నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ ట్రస్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. చికిత్స పూర్తి చేసుకున్నప్పటికీ 10-14 రోజుల పాటు రోగులను ఉంచేసి ఆరోగ్యశ్రీ ఖాతాల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నోటీసులు జారీ అయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఏపీలో ఏ ఫంక్షనైనా 50 మందితోనే.. సినిమా హాల్స్‌కు 50% పరిమితి.. జగన్ సర్కార్ సంచలన ఆదేశాలు

Mon Apr 26 , 2021
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో మహమ్మారి కట్టడికి జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.