ఏపీలో సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా? జగన్ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న!

కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న వేళ, ఆక్సిజన్ అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో హైకోర్టులో కీలక విచారణ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయా? అని జగన్ ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. ఏపీలో కరోనా వైరస్ చికిత్సపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న కరోనా చికిత్సపై హైకోర్టులో ఏపీ లిబర్టీ అసోసియేషన్‌ పిటిషన్‌ వేసింది. దీనిపై సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. రాష్ట్రంలో ఆక్సిజన్‌ నిల్వలు ఉన్నాయా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆక్సిజన్‌ ఉత్పత్తి కేంద్రాలను తెరిచారా? అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. ఆస్పత్రుల్లో పడకలు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా? అని ఆరా తీసింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేశారు? కొవిడ్‌ పరీక్షలు ఎంత మేరకు పెంచారు.. నివేదికలు ఎన్ని రోజుల్లో వస్తున్నాయి? అని పలు కీలక విషయాలపై హైకోర్టు ప్రశ్నలు సంధించింది.

ఒకవేళ కరోనా నిర్ధారణ పరీక్షలు ఆలస్యమైతే.. బాధితుల పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ అన్ని వివరాలను పిటిషనర్‌ కౌన్సిల్‌తో పాటు తమకు కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ఈ నెలలో 341 కొవిడ్ మరణాలు.. హైకోర్టుకు ప్రభుత్వం రిపోర్టు

Tue Apr 27 , 2021
Telangana High Court: ‘ఈ నెల 1 నుంచి 25 వరకు 341 మంది కరోనాతో మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 3.5 శాతం ఉంది. కరోనాపై నిపుణుల కమిటీ సమావేశాలు ఆన్‌లైన్‌ వేదికగానే జరుగుతున్నాయి.’ అని నివేదికలో ప్రభుత్వం పేర్కొంది.