సీఎం జగన్‌‌కు స్పెషల్ డే.. గవర్నర్ హరిచందన్ విషెస్, వైసీపీ అభిమానులు సైతం

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవం. శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్.. సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు

ప్రధానాంశాలు:సీఎం జగన్‌-భారతి రెడ్డిల 25వ వివాహ వార్షికోత్సవంవిషెస్ తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ప్రస్తుతం సిమ్లాలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతుల 25వ వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌- వైఎస్‌ భారతి రెడ్డిలకు 25వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ దంపతులకు జగన్నాధుడి, బాలాజీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితం గడపాలని మనసారా కోరుకుంటున్నాను ’అంటూ ట్వీట్ చేశారు. ఇటు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రి దంపతులకు విషెస్ చెబుతున్నారు.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం సిమ్లాలో ఉన్నారు. చండీగఢ్‌కు ప్రత్యేక విమానంలో వెళ్లి.. అక్కడ నుంచి హెలికాఫ్టర్‌లో సిమ్లా చేరుకున్నారు. తన 25వ వివాహ వార్షికోత్సవాన్ని జగన్‌ సిమ్లాలో జరుపుకుంటారు. తిరిగి 31న తాడేపల్లి చేరుకుంటారు. వివాహ వార్షికోత్సవం సిల్వర్ జూబ్లీ కావడంతో 5 రోజుల పాటు సీఎం జగన్ తన కుటుంబంతో గడపనున్నారు. ఈ ఐదు రోజుల టూర్‌ను ఫ్యామిలీ‌తో చేయాలని సీఎం జగన్ ప్లాన్ చేసుకున్నారు.

సీఎం జగన్ ముందుగా లండన్‌, పారిస్‌ వెళ్లాలని అనుకున్నారట.. ఈ మేరకు ప్రచారం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న కొవిడ్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సిమ్లా వెళ్లాలని నిర్ణయించుకున్నారట. రోజువారీ కార్యక్రమాలతో బిజీగా ఉండే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో కలిసి సిమ్లా టూర్‌కు వెళ్లారు. 28న 25 వివాహ వార్షికోత్సవం కావడంతో ప్రత్యేకంగా ఫ్యామిలీతో జరుపుకోవడాని ఈ టూర్ ప్లాన్ చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ప్రభుత్వ అబద్దాలను బయటపెట్టడం మేధావుల బాధ్యత.. సుప్రీంకోర్టు జడ్జ్ సంచలన వ్యాఖ్యలు

Sat Aug 28 , 2021
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించి, తప్పుడు కథనాలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.