రాష్ట్రంలో పీసీఏ ఏర్పాటుకు ప్రయత్నాలు.. ఛైర్మన్‌గా ఆయనకు బాధ్యతలు

పోలీస్ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి ప్రతి రాష్ట్రం తప్పనిసరిగా పోలీస్ కంప్లయింట్ అథారిటీని ఏర్పాటుచేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్‌ కంప్లైంట్‌ అథారిటీ (పీసీఏ) ఏర్పాటుకు ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ అథారిటీకి చైర్మన్‌గా జస్టిస్‌ కనగరాజ్‌‌ను నియమించనున్నరనే ప్రచారం సాగుతోంది. గతేడాది ఎస్‌ఈసీ బాధ్యతల నుంచి నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ను తప్పించి జస్టిస్ కనగరాజ్‌‌ను ప్రభుత్వం నియమించింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఆయన ఎస్ఈసీ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మళ్లీ రిటైర్డ్‌ జడ్జికి సముచిత గౌరవం ఇవ్వాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు భోగట్టా.

ఈ క్రమంలోనే పోలీసులపై ఫిర్యాదులను విచారించే పీసీఏ ఏర్పాటు యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు న్యాయం చేయకపోయినా, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించకపోయిన, సకాలంలో స్పందిచక పోయినా పీసీఏను పౌరులు ఆశ్రయించవచ్చు. పోలీసులపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు రాష్ట్రాలు పీసీఏను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. దీంతో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఈ అథారిటీలను ఏర్పాటుచేశాయి. తెలంగాణలో కూడా ఈ ఏడాది జనవరిలో పీసీఏను ఏర్పాటు చేశారు.

హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తిని ఛైర్మన్‌గా పీసీఏను ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్నాయి. పీసీఏలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, రిటైర్డ్‌ ఐపీఎస్‌తో పాటు ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ప్రభుత్వం ఎంపిక చేసిన వ్యక్తి సభ్యులుగా ఉంటారు. తమకు వచ్చిన ఫిర్యాదులను పీసీఏ విచారించి.. అందుకు బాధ్యులైన పోలీసులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది.

పీసీఏ సిఫారసులను కచ్చితంగా అమలు చేయాలా? వద్దా? అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఈ అథారిటీ ఏర్పాటుపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

Neelam Sahni: ఏపీ ఎస్ఈసీగా నీలం సాహ్ని వద్దు... హైకోర్టులో పిల్

Sun Jun 20 , 2021
నీలం సాహ్ని రూ.160 కోట్ల ప్రజాధనం వృథా చేశారన్నారు. ఆ సొమ్మును ఆమె నుంచి రాబట్టేందుకు వీలుగా రూ.160 కోట్లకు బ్యాంక్‌ పూచీకత్తు సమర్పించేలా ఆదేశించాలని అభ్యర్థించారు.